హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని

ABN , First Publish Date - 2022-07-07T08:38:36+05:30 IST

హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని నియమితులయ్యారు. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రాము ప్రస్తుతం డొమినికన్‌ రిపబ్లిక్‌లో భారత రాయబారిగా ఉన్నారు.

హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని

న్యూఢిల్లీ, జూలై 6: హైతీలో భారత రాయబారిగా రాము అబ్బగాని నియమితులయ్యారు. తెలంగాణలోని హన్మకొండకు చెందిన రాము ప్రస్తుతం డొమినికన్‌ రిపబ్లిక్‌లో భారత రాయబారిగా ఉన్నారు. 2001 బ్యాచ్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారి అయిన రామును డొమినికన్‌ రిపబ్లిక్‌ రాయబారిగా గతేడాది నియమించారు. అంతకుముందు ఆయన విదేశాంగ మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. హన్మకొండలోని మర్కాజీ ప్రభుత్వ హైస్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన రాము ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో ఇంటర్‌ చదివారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీవీఎంఎస్‌, ఎంవీఎంఎస్‌ చేసిన ఆయన జైపూర్‌లో నాబార్డు మేనేజర్‌గా విధులు నిర్వహించారు. 2001లో ఇండియన్‌ ఫారెస్టు సర్వీసె్‌సకు ఎంపికై జపాన్‌, థాయ్‌లాండ్‌లలోని భారత రాయబార కార్యాలయాల్లో పని చేశారు.

Updated Date - 2022-07-07T08:38:36+05:30 IST