Haiti కి తదుపరి భారత రాయబారిగా రాము అబ్బగాని

ABN , First Publish Date - 2022-07-06T21:13:55+05:30 IST

ప్రస్తుతం డొమినికన్ రిపబ్లిక్‌లో భారత రాయబారిగా ఉన్న రాము అబ్బగానిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. హైతీకి తదుపరి భారత రాయబారిగా నియమించింది.

Haiti కి తదుపరి భారత రాయబారిగా రాము అబ్బగాని

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం డొమినికన్ రిపబ్లిక్‌లో భారత రాయబారిగా ఉన్న రాము అబ్బగానిని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. హైతీకి తదుపరి భారత రాయబారిగా నియమించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2001 బ్యాచ్‌ ఐఎఫ్‌ఎస్‌ అధికారి అయిన రామును గతేడాది డొమినికన్‌ రిపబ్లిక్‌ రాయబారిగా నియమించిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శి హోదాలో పనిచేశారు. ఈయన స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ. అక్కడి మర్కాజీ ప్రభుత్వ హైస్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ చదివారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీవీఎస్సీ, ఎంవీఎస్సీ చేశారు. తర్వాత కొన్నాళ్లు జైపుర్‌లో నాబార్డ్‌ మేనేజర్‌గా పని చేశారు. అనంతరం 2001లో ఇండియన్‌ ఫారిన్‌ సర్వీస్‌కు ఎంపికయ్యారు. జపాన్‌, థాయ్‌లాండ్‌లలోని భారతీయ రాయబార కార్యాలయాల్లోనూ విధులు నిర్వహించారు.



Updated Date - 2022-07-06T21:13:55+05:30 IST