Hyderabad మెట్రోలో ర్యాంప్‌ వాక్‌..

ABN , First Publish Date - 2022-03-12T14:48:07+05:30 IST

Hyderabad మెట్రోలో ర్యాంప్‌ వాక్‌..

Hyderabad మెట్రోలో ర్యాంప్‌ వాక్‌..

హైదరాబాద్‌ సిటీ : తెలంగాణ చేనేత వస్ర్తాలు, స్థానిక కళలను ప్రోత్సహించడంలో భాగంగా హైదరాబాద్‌ మెట్రోరైల్‌ శుక్రవారం ప్రయాణికుల మధ్య ఫ్యాషన్‌ షో నిర్వహించింది. జేడీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (జేడీఐఎఫ్‌టీ)కి చెందిన ఔత్సాహిక డిజైనర్లు చేనేత వస్ర్తాలను ధరించి రైళ్లలో ర్యాంప్‌వాక్‌ చేశారు. బునాయీ ఉత్సవ్‌లో భాగంగా మార్చి 13 నుంచి 20 వరకు పంజాగుట్ట, ఎర్రమంజిల్‌ గల్లేరియా మాల్స్‌ వద్ద లైవ్‌ ఫ్యాషన్‌షోలు, వర్క్‌షా‌ప్‌లను నిర్వహిస్తున్నట్లు ఎల్‌అండ్‌టీ ఎండీ కేవీబీ రెడ్డి తెలిపారు.





Updated Date - 2022-03-12T14:48:07+05:30 IST