Abn logo
Apr 8 2020 @ 19:32PM

ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రాంకీ సంస్థ విరాళం

అమరావతి: రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలకు పలువురు దాతలు ముందుకువస్తున్నారు. కరోనా సహాయచర్యలకు ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు రాంకీ సంస్థ విరాళమిచ్చింది. రూ.3 కోట్ల చెక్కును సీఎం జగన్‌కు రాంకీ సీఈవో గౌతమ్‌రెడ్డి అందజేశారు. రూ.2 కోట్ల విలువైన పీపీఈ కిట్లు కూడా అందిస్తామని రాంకీ సంస్థ పేర్కొంది. సీఎం సహాయ నిధికి మంగళవారం డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ.5 కోట్లు అందించింది. సంస్థ ఉపాధ్యక్షుడు డాక్టర్‌ నారాయణరెడ్డి విజయవాడలోని సీఎస్‌ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నిని కలిసి చెక్కును అందజేశారు. 

Advertisement
Advertisement
Advertisement