రంగంపేట తహశీల్దార్‌గా ట్రైనీ కలెక్టర్‌

ABN , First Publish Date - 2020-11-30T07:15:36+05:30 IST

రంగంపేట తహశీల్దార్‌గా ట్రైనీ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ను ఆరువారాల శిక్షణ కోసం నియమిస్తూ కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.

రంగంపేట తహశీల్దార్‌గా ట్రైనీ కలెక్టర్‌

రంగంపేట, నవంబరు 29: రంగంపేట తహశీల్దార్‌గా ట్రైనీ కలెక్టర్‌ అపరాజితాసింగ్‌ను ఆరువారాల శిక్షణ కోసం నియమిస్తూ కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె డిసెంబరు 5 నుంచి జనవరి 15 వరకు ఇండిపెండెంట్‌గా చార్జి తీసుకుంటారు. కాగా సోమవారం తహశీల్దార్‌ ఉద్యోగ విరమణ చేయనున్న ప్రస్తుత తహశీల్దార్‌ వై.జయకు వీఆర్వోల ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-11-30T07:15:36+05:30 IST