Abn logo
Oct 18 2020 @ 15:18PM

వ్యాక్సిన్‌కు ఇంకా 3, 4 నెలల సమయం: డీఎంఈ రమేశ్ ‌రెడ్డి

Kaakateeya

హైదరాబాద్: పండుగల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్ రెడ్డి హెచ్చరించారు. గాంధీలో ప్రస్తుతం 350 కరోనా కేసులు మాత్రమే ఉన్నాయన్నారు. వ్యాక్సిన్‌కు ఇంకా 3, 4 నెలల సమయం పట్టొచ్చని అన్నారు. వరదల రిహాబిలిటేషన్ సెంటర్లలో టెస్టులు చేస్తున్నామని, సీఎం ఆదేశాల మేరకు అన్ని ఆస్పత్రులను అలెర్ట్ చేశామన్నారు. పరిశుభ్రత లేకుంటే సీజనల్ వ్యాధుల ముప్పు తప్పదన్నారు. కలుషితమైన నీటి ద్వారా, దోమల ద్వారా వచ్చే వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలన్నారు.  

Advertisement
Advertisement
Advertisement