కాంగ్రెస్‌ నుంచి రమేష్‌ రాథోడ్‌ సస్పెన్షన్‌

ABN , First Publish Date - 2021-02-28T05:35:31+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకు డు, 2018లో నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన రమేష్‌ రాథోడ్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేసినట్లు టీపీసీసీ

కాంగ్రెస్‌ నుంచి రమేష్‌ రాథోడ్‌ సస్పెన్షన్‌

అదిలాబాద్‌, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకు డు, 2018లో నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన రమేష్‌ రాథోడ్‌ను కాంగ్రెస్‌ పార్టీ నుంచి సస్పెన్షన్‌ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ క మిటీ చైర్మన్‌ కోదండరెడ్డి శనివారం రాత్రి ఓ ప్రకటనలో తెలిపా రు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని జిల్లా నాయకుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం రమేష్‌ రాథోడ్‌ను సస్పెన్షన్‌ చేసినట్లు కోదండరెడ్డి ప్రకటించారు. ఈ విషయమై రాథోడ్‌ రమేష్‌ను వివరణ కోరగా.. తనను సస్పెండ్‌ చేసే అధికారం ఎవరికి లేదన్నారు. అసలు తనకు కాంగ్రెస్‌లో సభ్యత్వమే లేదని తెలిపారు. త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీ మునిగిపోవడం ఖాయమని ప్రకటించారు.

Updated Date - 2021-02-28T05:35:31+05:30 IST