స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో రాందాస్, కంగనాల పోస్టర్

ABN , First Publish Date - 2020-09-22T17:04:23+05:30 IST

గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఫొటోలను ప్రచారానికి వినియోగించుకోవాలని...

స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో రాందాస్, కంగనాల పోస్టర్

వడోదర (గుజరాత్): గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బాలీవుడ్ నటి కంగనా రనౌత్‌ ఫొటోలను ప్రచారానికి వినియోగించుకోవాలని కేంద్రమంత్రి రాందాస్ అథవాలే నేతృత్వంలోని ఆర్పీఐ పార్టీ నేతలు నిర్ణయించారు.  గుజరాత్ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ) బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్ ఫొటోలతో ప్రచార పోస్టర్లు వేసింది. కంగనాను కలిసిన రాందాస్ అథవాలే ఫొటోతో కూడిన పోస్టర్లను ఆర్పీఐ కార్యకర్తలు వడోదరలోని కాలాఘోడా ప్రాంతంలో వేశారు. కంగనా ఇంటిని కూల్చివేసిన తర్వాత తమ పార్టీ అధినేత ఆమెను కలిసి మద్ధతు ఇచ్చారని, దాన్ని వడోదర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి వినియోగించుకుంటామని జిల్లా ఆర్పీఐ అధ్యక్షుడు రాజేష్ గోయల్ చెప్పారు. 

Updated Date - 2020-09-22T17:04:23+05:30 IST