Abn logo
Feb 21 2020 @ 21:19PM

వైష్ణవ్ తేజ్‌కు ఆహ్వానం పలికిన రామ్ చరణ్

ఫిల్మ్ ఇండస్ట్రీలోకి తన కజిన్ వైష్ణవ్ తేజ్‌ను ఆహ్వానించిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, అతను హీరోగా పరిచయమవుతున్న ‘ఉప్పెన’ మూవీకి సంబంధించిన కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తన ఫేస్‌బుక్ హ్యాండిల్‌లో, ‘బిగ్ వెల్కమ్ వైష్ణవ్ తేజ్! ఈ జర్నీని నువ్వు ప్రేమిస్తావు. పూర్తి స్థాయిలో దీన్ని ఆస్వాదించు. బుచ్చిబాబు సానా, కృతి శెట్టి, మైత్రీ మూవీ మేకర్స్ టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ అని పోస్ట్ చేశారు.


ఈ మహా శివరాత్రి స్పెషల్ పోస్టర్‌లో హీరోయిన్ కృతి శెట్టిని ఫాలో అవుతూ కనిపిస్తున్నాడు వైష్ణవ్ తేజ్. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్ యాక్టర్ విజయ్ సేతుపతి ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా, శాందత్ సైనుద్దీన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌తో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది.

Advertisement
Advertisement
Advertisement