Oct 17 2021 @ 13:21PM

కోరమీసం ట్రిమ్ చేసిన రామరాజు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు మూడు సంవత్సరాల పాటు రాజమౌళి ‘ఆర్.ఆర్.ఆర్’ సినిమాకే అంకిత మైపోయారు. ఈలోపు మరే ఇతర సినిమాల్లో నటించకుండా.. కేవలం తన ఓన్ ప్రొడక్షన్స్ లో తాను  ఒక ప్రధాన పాత్ర పోషించిన  చిరంజీవి ‘ఆచార్య’లో మాత్రమే నటించారు. ఆ సినిమాలో ‘ఆర్.ఆర్.ఆర్’ లోని రామరాజు గెటప్ లోని కోరమీసాలతో మేనేజ్ చేశారు. ప్రస్తుతం ‘ఆచార్య, ఆర్.ఆర్.ఆర్’ మూవీస్ రెండూ టాకీ పార్ట్స్ పూర్తి చేసుకున్నాయి.  దాంతో చరణ్ ఆ కోరమీసాలకు ఇప్పుడు కత్తెర వేశారు. ఇప్పుడు నీట్ షేవ్ తో ‘ధ్రువ’ గెటప్ లోకి వచ్చారు.  ఇటీవల ‘నాట్యం’ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వచ్చిన చెర్రీ కొత్త గెటప్.. అభిమానుల్ని ఆకట్టుకుంంది. అయ్యప్పమాలలో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో ఆధ్యాత్మికత ఉట్టిపడుతూ.. చెర్రీ స్పెషల్ గా కనిపించారు. అయితే ఈ గెటప్ శంకర్ సినిమా కోసమనే టాక్ వినిపిస్తోంది. ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న ఆ పాన్ ఇండియా సినిమా .. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కు వెళ్ళబోతోంది. ఈ సినిమాను శరవేగంగా తెరకెక్కించి.. తదుపరిగా  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోని సినిమాలో నటించబోతున్నారు చెర్రీ. అలాగే..దీని తర్వాత ప్రశాంత్ నీల్ సినిమాను కూడా లైన్ లో పెట్టుకున్నారు. ఇలా ఒకేసారి పాన్ ఇండియా మూవీస్ ను లైనప్ చేసిన చెర్రీ.. ఎట్టకేలకు ట్రిమ్ గా దర్శనమివ్వడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.