Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 24 May 2022 12:40:15 IST

Ramcharan త్రిపాత్రాభినయం.. ?

twitter-iconwatsapp-iconfb-icon

మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ (Ramcharan) ఇటీవల ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. క్రితం నెలలో వచ్చిన మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ‘ఆచార్య’ (Acharya) చిత్రం నిరాశపరిచినప్పటికీ..  RC 15 చిత్రంతో దాన్ని మరిచిపోయేలా చేసేందుకు చెర్రీ ప్రయత్నిస్తున్నాడు. శంకర్ (Shankar) దర్శకత్వంలో, దిల్ రాజు (Dil Raju) నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకొన్న ఈ సినిమా ఇటీవల వైజాగ్ షెడ్యూల్‌ను ప్రారంభించింది.  పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన పలు వార్తలు అభిమానుల్ని తెగ ఊరిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ RC 15లో రామ్ చరణ్ ద్విపాత్రాభియం చేస్తున్నట్టు వార్తలు రాగా..  తాజాగా ఇందులో చెర్రీ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. అంతేకాదండోయ్ వాటిలో ఒక పాత్ర పూర్తి నెగెటివ్ గా ఉంటుందని తెలుస్తోంది. 

తాజా సమాచారం ప్రకారం RC 15లో రామ్‌చరణ్ (Ramcharan) తండ్రి, ఇద్దరు కొడుకులుగా నటిస్తున్నాడట. కొడుకుల్లో ఒకరిని గ్రే షేడ్ పాత్రగా మలిచారని తెలుస్తోంది. ఆ ఇద్దరిలో ఒకరు విలన్ కాగా, తండ్రి పాత్ర సివిల్ సర్వెంట్ అని టాక్. ఇక నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర సినిమాకే హైలైట్‌గా నిలిచిపోతుందని సమాచారం. ఒక కొడుకు విలన్ గా మారడానికి బలమైన కారణం కూడా ఉంటుందట. సాధారణంగా శంకర్ చిత్రాల్లో విలన్ పాత్ర చాలా పవర్ ఫుల్‌గా ఉంటుంది. కొన్ని చిత్రాల్లో  హీరో కన్నా విలన్‌నే పవర్ ఫుల్ గా చూపించారు శంకర్. సో దీన్ని బట్టి.. చరణ్ నుంచి వీలైనంత ఎక్కువగా వివిధ కోణాల్లో నటనను శంకర్ రాబడతారని దీన్ని బట్టి అర్ధమవుతోంది. 

తండ్రి చిరంజీవి (Chiranjeevi ) తన కెరీర్ లో ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రంలో త్రిపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. అందులో ముగ్గురూ అన్నదమ్ములే. చిన్నప్ప్పుడు విడిపోయిన ఆ సోదరులు పెద్దయ్యాకా ఎలా కలుస్తారు అన్నదే సినిమా కథాంశం. ఈ సినిమా అప్పట్లో యావరేజ్ హిట్ గా నిలిచింది. అయితే అందులోని చిరు అభినయానికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇప్పుడు చెర్రీ కూడా తన తండ్రి బాటలో త్రిపాత్రాభినయం చేయడం విశేషంగా మారింది. మరి నిజంగానే RC 15 లో చరణ్ (Charan) త్రిపాత్రాభినయం చేస్తాడేమో చూడాలి.  

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement