వాణిజ్య రంగ పోర్టుగా రామాయపట్నం

ABN , First Publish Date - 2020-10-01T18:19:03+05:30 IST

జపాన్‌ దేశ భాగస్వామ్యంతో రా మాయపట్నం పోర్టును వాణిజ్య రంగ పోర్టుగా..

వాణిజ్య రంగ పోర్టుగా రామాయపట్నం

ఒంగోలులో విమానాశ్రయం కోసం ప్రణాళిక రూపొందించాలి

పరిశ్రమలశాఖ ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్‌


ఒంగోలు: జపాన్‌ దేశ భాగస్వామ్యంతో రా మాయపట్నం పోర్టును వాణిజ్య రంగ పోర్టుగా అభివృద్ధి చేసేందుకు ప్రభు త్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్‌. కరికాలవళవన్‌ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో పరిశ్రమల రంగం అభివృద్ధిపై జిల్లా అధికారులతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రామాయపట్నం పోర్టు నిర్మాణంతో పాటు ఇండస్ట్రీయల్‌హబ్‌ ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించాలన్నారు.


దొనకొండలో ఎయిర్‌ఫోర్స్‌, ఆర్మీ సంయుక్తంగా మూడు వేల ఎకరాల్లో డిఫెన్స్‌ మ్యానుఫ్యాక్చరింగ్‌ సెక్టార్‌ నిర్మించనుందని చెప్పారు. ఒంగోలు నియోజకవర్గంలో ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని, అందులో భాగంగానే విమానాశ్రయం ఏర్పాటుకూ ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. కలెక్టర్‌ భాస్కర్‌, జేసీ చేతన్‌, కందుకూరు సబ్‌కలెక్టర్‌ భార్గవ్‌తేజ్‌, శిక్షణ కలెక్టర్‌ టీ అభిషేక్‌, ఇన్‌చార్జి జేసీ కే వినాయకం, అధికారులు కే కృష్ణవేణి, చంద్రశేఖర్‌, ఎం ఎల్‌ నరసింహారావు, చంద్రశేఖర్‌, సంజీవరెడ్డి, రెడ్డయ్య, నగేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2020-10-01T18:19:03+05:30 IST