మార్చి 28 నుంచి ‘రామాయణ ఎక్స్‌ప్రెస్‌’

ABN , First Publish Date - 2020-02-20T09:07:11+05:30 IST

దేశంలోని ప్రసిద్ధ రామాలయాలన్నింటినీ దర్శించుకోవాలనుకుంటున్న వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. మార్చి 28న శ్రీ రామాయణ

మార్చి 28 నుంచి ‘రామాయణ ఎక్స్‌ప్రెస్‌’

దేశంలోని ప్రసిద్ధ రామాలయాలన్నింటినీ దర్శించుకోవాలనుకుంటున్న వారికి రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. మార్చి 28న శ్రీ రామాయణ ఎక్స్‌ప్రెస్‌ ప్రత్యేక రైలును నడపనుంది. ఢిల్లీ సఫ్దర్‌జంగ్‌, మొరాదాబాద్‌, బరేలీ, లఖ్‌నవూ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఎక్కొచ్చు. యూపీలోని అయోధ్య, నందిగ్రామ్‌లోని భారత్‌ మందిర్‌, బిహార్‌లోని సీతా మాత మందిర్‌, నేపాల్‌లోని జనక్‌పూర్‌, వారాణసీలోని తులసీ మాన్‌సమందిర్‌, సంకట్‌ మోచన్‌ మందిర్‌తో పాటు అనేక రామాలయాలను దర్శించుకోవచ్చు.


న్యూఢిల్లీ

Updated Date - 2020-02-20T09:07:11+05:30 IST