రామాయణ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అక్కడ ఏమి బోధిస్తారంటే..

ABN , First Publish Date - 2022-02-07T14:25:22+05:30 IST

రామాయణ విశ్వవిద్యాలయంలో శ్రీరాముడి జీవితం..

రామాయణ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? అక్కడ ఏమి బోధిస్తారంటే..

రామాయణ విశ్వవిద్యాలయంలో శ్రీరాముడి జీవితం, ఆయనకు సంబంధించిన సంస్కృతి, గ్రంథాలు తదితర అంశాలపై అధ్యయనాలు, పరిశోధనలు జరగనున్నాయి. అయోధ్యలో దాదాపు 21 ఎకరాల్లో ఈ యూనివర్సిటీని నిర్మించనున్నారు. రామాయణ విశ్వవిద్యాలయం గురించిన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీరాముని జన్మస్థలమైన అయోధ్యలో 21 ఎకరాల్లో రామాయణ యూనివర్సిటీని నిర్మించనున్నారు. ఇందుకోసం మహర్షి విద్యాపీఠ్ ట్రస్టు రూపురేఖలు సిద్ధం చేసింది. 


ప్రతిపాదిత యూనివర్సిటీని రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ప్రైవేట్ రంగం నిర్మించే అవకాశం ఉంది. రామనగరి అయోధ్యలో పరిశోధనల కోసం రామాయణ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విశ్వవిద్యాలయంలో కొన్ని విభాగాలు ఉంటాయని,  ఇందులో రామాయణ పరిశోధన, బోధనకు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. దీనితో పాటు హిందీ, సంస్కృత భాషలకు యూనివర్సిటీలో ప్రముఖ స్థానం కల్పించనున్నారు. ఇందులో విద్యార్థులకు వేదం, రామాయణం, ఉపనిషత్తులు, యోగా, ధ్యానం, ఆయుర్వేదం తదితర అంశాలను బోధించనున్నారు. రామాయణ విశ్వవిద్యాలయం మొదటి దశలో సుమారు 500 మంది విద్యార్థుల ప్రవేశానికి అవకాశం కల్పించనున్నారు. విశ్వవిద్యాలయం బహుళ అంతస్తులతో కూడి ఉంటుంది. దీంతో పాటు ఇక్కడ నివసించే విద్యార్థులకు భోజనం, వసతి సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటు వెనుక ఉన్న లక్ష్యం పురాతన, సంప్రదాయ జ్ఞాన సంపదను పరిరక్షించడం, అభివృద్ధి చేయడం. యువతలో ఆధ్యాత్మిక చింతనను బలోపేతం చేయడం. యూపీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ దినేష్ శర్మ తెలిపిన వివరాల ప్రకారం రామాయణ విశ్వవిద్యాలయం రాముని, జీవితం, ఆయన ఆచరించిన విలువల గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు తెలియజేస్తుంది. ఇందులో హిందూ ధర్మం, సంస్కృతిపై అధ్యయనాలు కూడా ఉంటాయి. విశ్వవిద్యాలయంలోని ప్రాచీన వేద విద్యా విధానంతో ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని అనుసంధానం చేసేందుకు కూడా కృషి చేయనున్నారు. 

Updated Date - 2022-02-07T14:25:22+05:30 IST