‘రామారావు’ ఆర్డర్స్ జారీ చేసే టైమొచ్చింది!

మాస్ మహారాజా రవితేజ పవర్ పుల్ పాత్రలో.. శరత్ మండవని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ ‘రామారావు ఆన్ డ్యూటీ’. మలయాళ బ్యూటీ రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాలో రవితేజ సిన్సియర్ యమ్మార్వోగా తనదైన శైలిలో నటించబోతున్నారు. నీతికి, నిజాయితీకి మారుపేరైన రామారావుని.. ట్యూటీలో ఉన్నప్పుడు ఎవరైనా డిస్బ్రబ్ చేస్తే తిక్కరేగుతుంది. అప్పుడు జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఇలాంటి పాత్రతో మాస్ మహారాజా మాస్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. 

ఇప్పటి వరకూ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాకి సంబంధించిన ఎలాంటి టీజర్స్ రాలేదు. అయితే రేపు (సోమవారం) ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ఈ సినిమాకి సంబంధించిన ఓ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఆ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించారు. రామారావు ఇష్యూయింగ్ ఆర్డర్స్ టుమారో అంటూ మెన్షన్ చేశారు. మరి ఆ అనౌన్స్ మెంట్ టీజర్ దా, లేక రిలీజ్ డేట్ దా అనే విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు. మరి రామారావు ఇవ్వబోయే ఆ ఆర్డర్స్ ఏంటో తెలియాలంటే.. రేపటి వరకూ ఆగాల్సిందే.Advertisement