‘రామప్ప’ మనకు గర్వకారణం

ABN , First Publish Date - 2021-07-27T05:36:10+05:30 IST

యునెస్కో గుర్తింపుతో విశ్వ విఖ్యాతి పొందిన రామప్ప ఆలయం కాకతీయుల కళా వైభవానికి నిదర్శనమని రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమ శాఖ మం త్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, గం డ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ములుగు, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్లు కుసుమ జగదీశ్‌, గండ్ర జ్యోతితో కలిసి సోమవారం రామప్ప దేవాలయాన్ని సందర్శించారు.

‘రామప్ప’ మనకు గర్వకారణం
రామప్ప ఆలయ ఆవరణలో మంత్రులు, ప్రజాప్రతినిఽధులు, అధికారులు

యునెస్కో గుర్తింపుతో కాకతీయుల శిల్పకళా వైభవానికి విశ్వఖ్యాతి  
సీఎం కేసీఆర్‌ కృషి వల్లే కల సాకారం
పర్యాటక హబ్‌గా ములుగు మరింత అభివృద్ధి
రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌
మంత్రి గంగుల, ఇతర ప్రజా ప్రతినిధులతో కలిసి రామప్ప సందర్శన
ఆలయ ఆవరణలో కేక్‌ కట్‌ చేసి సంబరాలు


వెంకటాపూర్‌(రామప్ప), జూలై 26: యునెస్కో గుర్తింపుతో విశ్వ విఖ్యాతి పొందిన రామప్ప ఆలయం కాకతీయుల కళా వైభవానికి నిదర్శనమని రాష్ట్ర గిరిజన, స్ర్తీ శిశుసంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. రామప్ప ఆలయం ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన నేపథ్యంలో పౌరసరఫరాల శాఖ, బీసీ సంక్షేమ శాఖ మం త్రి గంగుల కమలాకర్‌, ఎమ్మెల్యేలు ధనసరి సీతక్క, గం డ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి, ములుగు, వరంగల్‌ రూరల్‌ జడ్పీ చైర్‌పర్సన్లు కుసుమ జగదీశ్‌, గండ్ర జ్యోతితో కలిసి సోమవారం రామప్ప దేవాలయాన్ని సందర్శించారు.

పూజారులు వారిని పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు. రుద్రేశ్వరుడిని దర్శించుకున్న మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రామప్ప ఆలయానికి ప్రపంచస్థాయి గుర్తింపు రావడంతో మంత్రి సత్యవతిరాథోడ్‌ ఆలయ పరిసరాలను కాలి నడకన తిరిగి చూశారు. అపురూప శిల్పాలను తడి మి పరిశీలించారు. ఆలయ ఆవరణలో మంత్రులు, ప్రజాప్రతినిధులు కేక్‌ కట్‌ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సత్యవతి విలేకరులతో మా ట్లాడారు. రామప్పకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిన సందర్భంగా రామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. రామప్పకు యునె స్కో గుర్తింపు రావడానికి కృషి చేసిన సీఎం కేసీఆర్‌, మం త్రులు, ఎమ్మెల్యేలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో ఉండే కాకతీయ కట్టడాలకు ప్రపంచ గుర్తింపు తెచ్చేందుకు కేసీఆర్‌ ఉద్యమ కాలం నుంచే ప్రయత్నం చేశారని, దానికి ఫలితం నేడు లభించిందని అన్నారు. యు నెస్కో గుర్తింపు వల్ల పురావ స్తు శాఖ ఆధీనంలో ఆలయం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఆలయానికి గుర్తింపు రావడానికి ఎంతో కృషిచేసిన పాండురంగారావు, పాపారా వు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డిని అభినందించారు.

ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క మాట్లాడుతూ రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు రావడం సంతోషకరమని అన్నారు. ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం కృషి చేసిన నీట్‌ రిటైర్డు ప్రొఫెసర్‌ పాండురంగారావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించాలని ప్రభుత్వాలను కోరారు.

ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రామప్పకు వారసత్వ హోదా రావడం భారతీయులందరికీ గర్వకారణమన్నారు.  ప్రపంచవ్యాప్తంగా 21దేశాల ప్రతినిధులు ఓటింగ్‌ ప్రక్రియలో పాలుపంచుకున్నారని, 17 దేశాల ప్రతినిధులు రామప్ప దేవాలయానికి వారసత్వ హోదా వచ్చేందుకు కృషిచేశారని, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.  రామప్పకు వారసత్వ హోదా ఇవ్వడం ద్వారా 800 సంవత్సరాలనాటి దేవాలయానికి తగిన గుర్తింపు లభించిందని ఆనందం వ్యక్తంచేశారు. దీని ద్వారా ములుగు ప్రాంతం పర్యాటక హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు.   

ఈ  కార్యక్రమంలో కుడా చైర్మన్‌ మర్రి యాదవ రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వాసుదేవరెడ్డి, ఫర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగుర్ల వెంక న్న, స్థానిక సర్పంచ్‌ డోలి రజిత, ఎంపీపీలు బుర్ర రజిత, గండ్ర కోట శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు కూరెల్ల రామాచారి, ఆలయ పరిరక్షణ కమిటీ సభ్యుడు ఆకిరెడ్డి రాంమోహన్‌ పాల్గొన్నారు.  


దశాబ్దకాల శ్రమ ఫలించింది..
రామప్పకు యునెస్కో గుర్తింపు దక్కడం హర్షణీయం
కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకుడు బీవీ పాపారావు


కాళోజీ జంక్షన్‌, జూలై 26 : రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించడంపై కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ వ్యవస్థాపకులు, ధర్మకర్త రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి బీవీ పాపారావు, మరో ధర్మకర్త పాండురంగారావు ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్‌లో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో వారు మాట్లాడారు. దశాబ్దకాల శ్రమ ఫలితంగానే రామప్పకు యునెస్కో నుంచి గుర్తింపు లభించిందని వారు అన్నారు. 2009లో కాకతీయుల వారసత్వ సంపదకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలని  స్పష్టమైన లక్ష్యంతో ట్రస్టును ఏర్పాటు చేసి ప్రయత్నాలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా రామప్పను గుర్తించడం తమ లక్ష్యంలో ఒక మైలురాయి అని వచ్చే దశాబ్దంలో ఇతర కాకతీయ కట్టడాల అన్నింటి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. 2010లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఉధృతంగా ఉన్నప్పుడు ఈ ప్రయాణం ప్రారంభమైందని, అప్పటి సాంస్కృతిక శాఖ మంత్రి గీతారెడ్డి కాకతీయ హెరిటేజ్‌ సమన్వయకర్తలుగా అధికారికంగా కమిటీని ఏర్పాటుచేసి ట్రస్టు ప్రారంభానికి ప్రేరణ ఇవ్వగా  ట్రస్ట్‌ తరపున కాకతీయ వారసత్వ కట్టడాలను ప్రపంచ వారసత్వ సంపదలకు సంబంధించిన తాత్కాలిక జాబితాలో ఉంచగలిగామన్నారు.

కాకతీయ వారసత్వాన్ని ప్రోత్సహించేందుకు ట్రస్టు చేస్తున్న కృషి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం మరింత రెట్టింపు అయ్యిందన్నారు. ప్రభుత్వ సాయంతో ట్రస్ట్‌ 2016లో నామినేషన్‌ ప్రచారాన్ని ప్రారంభించిందన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, ప్రధాని మోదీతో మాట్లాడి కాకతీయ కట్టడాల ప్రాశస్థ్యాన్ని వివరించి అధికారికంగా లేఖ ఇవ్వగా 2019లో యునెస్కోకు భారత ప్రభుత్వం నామినేషన్‌ సమర్పించిందన్నారు. నామినేషన్‌ డౌసియర్‌ను తయారు చేసేందుకు ట్రస్ట్‌ తరపున ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణమూర్తిని నియమించిందన్నారు. డౌసియర్‌ రూపకల్పనలో రామప్పకు సంబంధించిన సమగ్ర రిపోర్టు తయారుచేసినట్లు పేర్కొన్నారు.  రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ పాండురంగారావు కాకతీయుల జియోటెక్నికల్‌ ఇంజనీరింగ్‌పై వివరాలు సమకూర్చారని వివరించారు. నవంబరు 2019లో పారి్‌సలో సుమారు 30 మంది అంతర్జాతీయ నిపుణుల సమక్షంలో నామినేషన్‌ను బలపరచడంలో    సూర్యనారాయణమూర్తితో సహా తాము తీవ్రంగా కృషి చేశామన్నారు. యునెస్కోలోని భారత రాయబారి విశాల్‌శర్మ, కొత్త సాంస్కృతిక కేంద్ర మంత్రులు మీనాక్షిలేకి, కిషన్‌రెడ్డి సాయంతో దౌత్య ప్రచారం చేపట్టి ప్రపంచ వారసత్వ కమిటీ సభ్యులను ఒప్పించడంలో విజయం సాధించినట్లు వెల్లడించారు. సమావేశంలో పాపారావుతో పాటు ఆర్కిటెక్ట్‌ సూర్యనారాయణమూర్తి పాల్గొన్నారు.







Updated Date - 2021-07-27T05:36:10+05:30 IST