రామనాథంబాబును మార్చాల్సిందే!

ABN , First Publish Date - 2022-09-25T05:24:24+05:30 IST

వైసీపీ పర్చూరు నియో జకవర్గ ఇన్‌చార్జిని రావి రామనాథంబాబును మార్చాల్సిందేనని ఆపార్టీ కారంచేడు నేతలు గళమెత్తారు.

రామనాథంబాబును మార్చాల్సిందే!
మాట్లాడుతున్న ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు

కారంచేడులో గళమెత్తిన వైసీపీ నేతలు

కారంచేడు(పర్చూరు), సెప్టెంబరు 24: వైసీపీ పర్చూరు నియో జకవర్గ ఇన్‌చార్జిని రావి రామనాథంబాబును మార్చాల్సిందేనని ఆపార్టీ కారంచేడు నేతలు గళమెత్తారు.  శనివారం కారంచేడు మండల పరిష త్‌ కార్యాలయ సమావేశం ప్రాంగణంలో  జరిగిన సమావేశానికి ఎంపీ పీ ఎంపీపీ నీరుకట్టు వాసుబాబు అధ్యక్షత వహించి మాట్లాడారు.  రామనాథంబాబు పార్టీ ప్రజాప్రతినిధులను, నేతలను పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమైన కార్యక్రమాలు, సమావే శాలకు కూడా ఆహ్వానించటం లేదన్నారు. ఇలా అయితే పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లా స్ధాయి అధి కారులు మండలంలో చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చే విష యం కూడా తమకు తెలియటంలేదని వాపోయారు. ప్రస్తుతం మం డలంలో నెలకొన్న సమస్యలను అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ సమావేశం ఏర్పాటుచేసినట్టు చెప్పారు. తాము కడవరకు పార్టీకి విధేయులగానే పనిచేస్తామని స్పష్టం చేశారు. 

పర్చూరు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే బాలినేని శ్రీ నివాసరెడ్డి చలవేనని ఎంపీపీ వాసుబాబు పేర్కొన్నారు. బాలి నేని ప్రమేయం లేకుండా చూ డాలనుకోవటం అవివేకమన్నా రు. కాంచేడు మండలానికి సంబంధించి జనరల్‌ఫండ్‌, 15వ ఆర్థిక సంఘ నిధులతో పాటు, జడ్పీ నిధులతో ఆయా గ్రామాల్లోని సర్పంచ్‌ లు, ఎంపీటీసీల సూచనల మేరకు అభివృద్ధి పనులకు కేటాయించి నట్టు చెప్పారు. అంతకుముందు తాము పదవిని చేపట్టి ఏడాది పూర్త యిన సందర్భంగా చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలపై మా ట్లాడారు. 

కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ ఐనంపూడి వనజ, మండల కన్వీనర్‌ దండా చౌదరి, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు కొర్రపాటి అని ల్‌, మండల కోఆప్షన్‌ సభ్యుడు  ముల్లా నూర్‌అహ్మద్‌, ఎంపీటీసీలు మౌలాలి, కట్టాబాబు, పాలేరు వీరమ్మ, కొడాలి ధర్మ, నాయకులు యా ర్లగడ్డ శ్రీనివాసరావు, గోగినేని సతీష్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-25T05:24:24+05:30 IST