Abn logo
Jun 6 2020 @ 18:15PM

డి.రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం

మూవీ మొగల్ డా.డి రామానాయుడు 85వ జయంతి కార్యక్రమం హైదరాబాదు ఫిలిం ఛాంబర్‌లో జరిగింది. ‌ఈ కార్యక్రమంలో డి.సురేష్ బాబు , సి.కల్యాణ్  , కె.ఎస్.రామారావు, అభిరామ్ దగ్గుబాటి, కాజా సూర్యనారాయణ జె. బాలరాజు పాల్గొని రామానాయుడు విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్మాత సి‌.కల్యాణ్ మాట్లాడుతూ ‘‘రామానాయుడుగారు మాకు ఓ హీరో, రోల్ మోడల్. దాసరిగారు ,రామానాయుడుగారు ఎంతగానో ప్రోత్సహించారు. నిర్మాతలగానే కాకుండా , సినీ పరిశ్రమ, దానికి అనుంబంద ఆఫీస్‌లన్నీ డెవలెప్ కావటానికి రామానాయుడుగారే కారణం. నాయుడుగారిని తలుచుకుని మేము సినిమా స్టార్ట్ చేస్తాం. ఆయన జయంతిని ఎప్పుడు  గొప్పగా జరుపుకుంటాం’’ అన్నారు.  దగ్గుబాటి అభిరామ్ మాట్లాడుతూ ‘‘తాత గారు  ఫిజికల్ లేకున్నా ,మెంటల్ గా నాకు సపోర్ట్ గానే  ఉంటారు’’ అన్నారు. నిర్మాత కె.ఎస్‌రామారావు మాట్లాడుతూ ‘‘నిర్మాతగా నాకు రామానాయుడుగారే స్పూర్తి.‌ వారి ఫాలోవర్‌గా సినిమాలు చేశాను. మా బ్యానర్‌లో మంచి సినిమాలు రావటానికి నాయుడు గారి ప్రొత్సాహం ఎంతో ఉంది’’ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement