గాంధీపేట రమణను అభినందిస్తున్న కిశోర్‌కుమార్ రెడ్డి
కలికిరి, మే 20: రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడుగా వాల్మీకిపురంకు చెందిన గాంధీపేట రమణను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా తన నియామకం కోసం కృషి చేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్ రెడ్డికి రమణ కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నగరిపల్లెలో తనను కలిసిన రమణను ఆయన అభినందించారు. ఎస్సీలకు నిధుల కేటాయింపు విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. వాల్మీకిపురం టీడీపీ అధ్యక్షుడు మల్లికార్జున రెడ్డి, నాయకులు పాల్గొన్నారు.