రామమందిర నిధి సమీకరణ

ABN , First Publish Date - 2021-01-16T06:00:16+05:30 IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి నంద్యాల ఎస్‌బీఐ కాలనీ రామాలయం నుంచి రామమందిర నిర్మాణ నిధి సమీకరణ శుక్రవారం ప్రారంభించారు.

రామమందిర నిధి సమీకరణ
ఆత్మకూరులో విరాళం ఇస్తున్న వీహెచ్‌పీ నాయకుడు శ్రీధర్‌గుప్తా

నంద్యాల (కల్చరల్‌), జనవరి 15: అయోధ్య రామమందిర నిర్మాణానికి నంద్యాల ఎస్‌బీఐ కాలనీ రామాలయం నుంచి రామమందిర నిర్మాణ నిధి సమీకరణ శుక్రవారం ప్రారంభించారు. డాక్టర్‌ రామకృష్ణారెడ్డి లక్ష రూపాయలు, పబ్బు బాలచంద్రుడు లక్ష రూపాయలు, విష్ణువర్ధన్‌ రెడ్డి లక్ష రూపాయలు, దామోదర్‌ రెడ్డి 10వేలు, చిలుకూరి శ్రీనివాస్‌ రూ.10వేలు, మారం వెంకటసుబ్బయ్య 20వేలు, గోళ్ల సుదర్శనం రూ.1,11,000 ఇచ్చారు. డాక్టర్‌ ఉదయశంకర్‌, శ్రీనివాస్‌, బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి, పర్యావరణ ప్రముఖ్‌ శేషు, విభాగ కార ్యవాహ మనోహర్‌, రామాలయ కమిటీ మెంబర్లు పాల్గొన్నారు.


మహానంది: అయోధ్య రామమందిర నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంలో భాగంగానే ఇంటింటా తిరిగి నిధులు సేకరిస్తున్నట్లు మహానందికి చెందిన వాసవి మహిళలు తెలిపారు. శుక్రవారం మహానంది గ్రామంలో ఇంటింటా తిరిగి శ్రీరామ కరసేవకులను అయోధ్య రామమందిరం నిర్మాణం కోసం నిధులు సేకరించడంలో సహకరించారు. ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు మునగనూరి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.


బండి ఆత్మకూరు: అయోధ్యలో రామాలయ నిర్హాణం కోసం బండిఆత్మకూరులో నిధుల సేకరణ చేపట్టారు.చింతానాగేశ్వరరావు వీవర్స్‌ కాలనీలో శ్రీరామ మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్‌ కార్యక్రమం కింద నిధులను సేకరించారు. రాజశేఖర్‌, రమేష్‌, సుష్మంత్‌, సుదర్శన్‌, మధు, రామరాజు పాల్గొన్నారు.


ఆత్మకూరు: శ్రీరామభక్తుల నిధి సమర్పణ కార్యక్రమం మండలంలో ప్రారంభమైంది. ఆత్మకూరులోని ఆంజనేయస్వామి దేవాలయంలో ఈ కార్యక్ర మాన్ని శాస్రోక్తంగా జరిపారు. పురోహితుడు గరుడాద్రి సత్యనారాయణశర్మ మాట్లాడుతూ హిందువులందరూ ఐక్యంగా మెలిగి హిందూ ధర్మాన్ని పరిరక్షించాలని ఆకాంక్షించారు. పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు అయోధ్య రామమందిర నిర్మాణానికి నిధి సమర్పణ చేశారు. వీరిలో మారం పాండురంగస్వామి జ్ఞాపకార్థం వారి కుటుంబసభ్యులు రూ.25వేలు, వీహెచ్‌పీ నాయకుడు అత్తులూరి శ్రీధర్‌గుప్తా రూ.20వేలు, వైసీపీ నాయకులు జయకృష్ణ రూ.20వేలు, రిటైర్డు తహసీల్దార్‌ పాణ్యం రామకృష్ణుడు రూ.10116, ఉపాధ్యాయులు యాతం వెంకటేశ్వర్లు రూ.5వేలను కమిటీ సభ్యులకు అందజేశారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర నిధి సమర్పణ అభియా న్‌ ఆత్మకూరు ఖండ ప్రతినిధులు వాసుదేవరెడ్డి, శివరామకృష్ణ, వెంకటకృష్ణ, ప్రశాంత్‌, ఆదినారాయణ, భానుమూర్తి, జగదీష్‌ తదితరులు ఉన్నారు.


వెలుగోడు మండలంలో అయోధ్య రామమందిర నిర్మాణానికి సంబంధించి నిధుల సమర్పణ ప్రారంభించారు. నిర్వాహకులు నాగేశ్వరరావు, పురుషోత్తంగౌడ్‌, పార్థసారథిరెడ్డి, రవికిశోర్‌రెడ్డి, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-01-16T06:00:16+05:30 IST