జీవన మంత్రం: ఆ సన్యాసి.. కుక్క దగ్గరున్న రొట్టె తీసుకుని తిన్నాడు.. రామకృష్ణులవారు తన మేనల్లుడిని పిలిచి ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2021-11-27T12:52:07+05:30 IST

ఒకరోజు రామకృష్ణ పరమహంస కాళీ మాత ఆలయంలో..

జీవన మంత్రం: ఆ సన్యాసి.. కుక్క దగ్గరున్న రొట్టె తీసుకుని తిన్నాడు.. రామకృష్ణులవారు తన మేనల్లుడిని పిలిచి ఏమన్నారంటే..

ఒకరోజు రామకృష్ణ పరమహంస కాళీ మాత ఆలయంలో కూర్చుని ఉన్నారు.  ఆ సమయంలో ఒక సన్యాసి ఆలయానికి వచ్చాడు. ఆ సన్యాసి.. రామకృష్ణ పరమహంసను చూడలేదు, కానీ పరమహంస ఆయనను గమనించారు. ఆ  సన్యాసి ఆకలితో ఉన్నాడు. అతను అటు ఇటు చూశాడు. కానీ అతనికి ఎక్కడా ఆహారం కనిపించలేదు.  అదే సమయంలో గుడి బయట ఓ కుక్క రొట్టె తింటోంది. ఆ సన్యాసి కుక్క దగ్గరకు వెళ్లి, దానిని ఎత్తుకుని.. ‘అయ్యో.. నువ్వు ఒక్కత్తివే రొట్టె తింటున్నావు. మాకూ కాస్త ఇవ్వచ్చు కదా' అన్నాడు. అక్కడ ఉన్న చాలా మందితో పాటు, పరమహంస కూడా ఆ సన్యాసిని విచిత్రంగా చూశారు. ఆ సన్యాసి.. మనిషితో ఎలా మాట్లాడుతారో కుక్కతో కూడా అలాగే మాట్లాడాడు. ఆ తరువాత కుక్క తింటున్న రొట్టెలోని కొంత భాగాన్ని తిన్నాడు. అనంతరం ఆలయాన్ని సందర్శించి, అమ్మవారిని స్తుతించి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు. 


ఇంతలో రామకృష్ణ పరమహంస తన మేనల్లుడిని పిలిచాడు, అతని పేరు హృదయ్ ముఖర్జీ.  అతను మేనల్లుడితో ఇలా అన్నాడు.. 'సన్యాసులు ఎలా ఉంటారని మీరు ఎప్పుడూ అడుగుతుంటారు.  ఇప్పుడు మీరు ఆ సన్యాసిని అనుసరించండి.. అతను మీతో ఏదైనా చెబితే, ఆ విషయం  నాకు ఆ విషయం చెప్పండి.  మేనల్లుడు ఆ సన్యాసిని అనుసరించాడు. దీనిని గమనించిన ఆ సన్యాసి హృదయ్ ముఖర్జీతో 'ఏమిటి.. మీరు నన్ను ఎందుకు అనుసరిస్తున్నారు?' అని అడిగాడు. ‘మీ దగ్గర నుంచి జ్ఞానం కావాలి’ అని హృదయ్ అన్నాడు. దీనికి సన్యాసి సమాధానమిస్తూ 'ఆలయంలోని ఈ కుండలో నింపిన నీటిని.. గంగాజలాన్ని ఒకేలా పరిగణించడం ప్రారంభించిన రోజు.. మీరు సన్యాసి అవుతారు.. కర్ణకఠోరమైన శబ్ధాన్ని.. శ్రావ్యమైన స్వరాన్ని ఒకేలా పరిగణించగలిగి.. ఆ రెండూ మీకు మధురంగా ​​వినిపించినప్పుడు మీరు నిజమైన పండితులవుతారని అర్థం చేసుకోండి’ అని అన్నాడు. హృదయ్.. పరమహంసతో ఈ విషయం చెప్పగా.. ఆయన 'ఇదే సన్యాసత్వానికి సంకేతం. అతనికి ఆకలి వేయగా, ఆయన కుక్క దగ్గర కూర్చుని అది తింటున్న రొట్టెలోని కొంత భాగం తిన్నారు. మీరు కూడా ఇదేవిధంగా దృష్టిలో తేడాను చెరిపివేయండి. ఆ సన్యాసిలో ఉన్న గొప్ప ఆస్తి సమానత్వం.' అని అన్నారు.





Updated Date - 2021-11-27T12:52:07+05:30 IST