రామకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-04-18T20:47:55+05:30 IST

మాజీ హోంగార్డ్ రామకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

రామకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు

భువనగిరి: మాజీ హోంగార్డ్ రామకృష్ణ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్య కేసులో బీబీనగర్‌లో పని చేసే మరో హోంగార్డ్ యాదగిరి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. నిందితుడు వెంకటేష్‌కు లతీఫ్ గ్యాంగ్‌ను యాదగిరే పరిచయం చేశాడు. ఆరు నెలలుగా రామకృష్ణ హత్యకు  వెంకటేష్ కుట్ర పన్నారు. లతీఫ్ గ్యాంగ్‌కు రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి భార్గవి తండ్రి వెంకటేష్ హత్య చేయించారు. రామకృష్ణ ఆర్థికంగా స్థిరంగా లేడని, తనతో తిరుగుతూనే తన కూతురు భార్గవిని ట్రాప్ చేశాడని వెంకటేష్ కోపం పెంచుకొని రామకృష్ణను హత్య చేయించారు. అనంతరం సిద్ధిపేట సమీపంలోని లకుడారం వద్ద మృత దేహాన్ని పాతి పెట్టినట్లు నిందితులు ఒప్పుకున్నారు. 


ఈ సందర్భంగా భువనగిరి ఏసీపీ వెంకట్ రెడ్డి ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ మాజీ హోంగార్డ్ పరువు హత్య కేసులో మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. రూ. 10 లక్షలు సుపారీ ఇచ్చి హత్య చేయించినట్లు గుర్తించామన్నారు. రామకృష్ణ భార్య భార్గవి తండ్రి వెంకటేష్ హత్య చేయించారన్నారు. వెంకటేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు చెప్పారు. లతీఫ్ గ్యాంగ్ హత్య చేసినట్లు గుర్తించామని, ఆర్థికంగా స్థిరంగా లేడని, తనతో తిరుగుతూనే  నా కూతురు భార్గవిని ట్రాప్ చేశాడని కక్షతో హత్య చేశారన్నారు. తనకు ఉన్న ఆస్తిలో వాటా కావాలని, తన కూతురు భార్గవి ద్వారా కేసు వేయిస్తా నంటూ రామకృష్ణ బెదిరింపులకు దిగడాని దీంతో రూ. 10 లక్షలు లతీఫ్ గ్యాంగ్‌కు ఇచ్చి హత్య చేయించినట్లు వెంకటేష్ చెప్పారన్నారు. ఇంకా ఈ కేసుకు సంబంధించి పరారీలో మరో నలుగురు నిందితులు ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని ఏసీపీ వెంకట్ రెడ్డి తెలిపారు.



Updated Date - 2022-04-18T20:47:55+05:30 IST