యూట్యూబ్‌లో విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యక్రమాలు

ABN , First Publish Date - 2020-09-29T18:29:50+05:30 IST

ఆధ్యాత్మికతతో పాటు వివేకానందుని భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్న సంస్థ రామకృష్ణ మిషన్. ఆబాలగోపాలానికి భారతీయతను నేర్పుతూ.. రామకృష్ణుల మార్గాన్ని చూపుతూ.. జాతి కోసం శ్రమించే విధంగా రూపుదిద్దుతోంది.

యూట్యూబ్‌లో విజయవాడ రామకృష్ణ మిషన్ కార్యక్రమాలు

విజయవాడ: ఆధ్యాత్మికతతో పాటు వివేకానందుని భావజాలాన్ని ప్రపంచవ్యాప్తం చేస్తున్న సంస్థ రామకృష్ణ మిషన్. ఆబాలగోపాలానికి భారతీయతను నేర్పుతూ.. రామకృష్ణుల మార్గాన్ని చూపుతూ.. జాతి కోసం శ్రమించే విధంగా రూపుదిద్దుతోంది. ఆ సంస్థ దేశవ్యాప్తంగా శాఖోపశాఖలుగా విస్తరించింది. తెలుగునాట తెలంగాణ, రాయలసీమ, కోస్తా ఆంధ్రాలలోనూ శాఖలున్న విషయం తెలిసిందే. ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని విజయవాడలో.. కృష్ణానది తీరంలో.. సీతానగరంలో ఏర్పాటు చేసిన రామకృష్ణ మిషన్ ఏళ్లుగా సామాజిక సేవలో తరిస్తోంది. వివేకానందులు ప్రవచించిన ‘మానవసేవే - మాధవసేవ’ వ్యాఖ్యలను తూ.చ. తప్పకుండా పాటిస్తూ... భావి పౌరులను తీర్చిదిద్దుతోంది. ఈ సంస్థ సామాజిక మాధ్యమాల్లోనూ చురుగ్గా ఉంటోంది. విజయవాడ నుంచి రామకృష్ణ పరమహంస, శారదా మాత, వివేకనందుల బోధనలను అందరికీ మరింత చేరువయ్యేలా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించింది. తమ ఛానల్ ద్వారా విద్యార్థులకు, పెద్దలకు ఉపయుక్తమైన సమాచారం అందించేందుకు ప్రయత్నిస్తోంది. వివేకవాణిని బలంగా వినిపించేందుకు యూట్యూబ్ ఛానల్ చక్కని మార్గంగా తాము భావిస్తున్నట్టు విజయవాడ రామకృష్ణ మిషన్ వారు తెలిపారు.  



Updated Date - 2020-09-29T18:29:50+05:30 IST