విదేశాల్లో ఉన్న చిన్నారులకు రామకృష్ణ మఠ్ సమ్మర్ క్యాంప్

ABN , First Publish Date - 2021-06-25T20:43:45+05:30 IST

విదేశాల్లో.. ముఖ్యంగా అమెరికా, కెనడాల్లో ఉన్న చిన్నారులకు రామకృష్ణమఠం అద్భుతమైన అవకాశం కల్పించింది. నెలరోజుల సమ్మర్ క్యాంప్ నిర్వహించ తలపెట్టింది.

విదేశాల్లో ఉన్న చిన్నారులకు రామకృష్ణ మఠ్ సమ్మర్ క్యాంప్

విదేశాల్లో.. ముఖ్యంగా అమెరికా, కెనడాల్లో ఉన్న చిన్నారులకు రామకృష్ణమఠం అద్భుతమైన అవకాశం కల్పించింది. నెలరోజుల సమ్మర్ క్యాంప్ నిర్వహించ తలపెట్టింది. ఆన్‌లైన్‌లో నడిచే తరగతులకు నాలుగవ గ్రేడ్ నుంచి 10వ గ్రేడ్ విద్యార్థులు అర్హులు.  


బాల్యం నుంచే చిన్నారులకు నైతిక విలువలు నేర్పించడం, పురాణేతిహాసాల్లోని మంచిని అందించడం, భజనలు చేయించడం తదితర అంశాలపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్నారు. జూలై 5 నుంచి ఆగస్ట్ 5 వరకు క్లాసులు జరగనున్నాయి. రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్(వీఐహెచ్ఈ) ఆధ్వర్యంలో జరిగే క్లాసులకు 


ప్రతి రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి 8.00 గంటల వరకు క్లాసులు ఉంటాయి. అలాగే సోమ, బుధ, శుక్రవారాల్లో వారానికి మూడు రోజులు తరగతులు ఉంటాయి. 


రిజిస్ట్రేషన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. https://rkmath.org/vihe/ 


మరిన్ని వివరాలకు 9177232696 నంబర్‌కు ‘Hi’ అని వాట్సాప్ మెసేజ్ చేయగలరు. లేదా hyderabad.vihe@rkmm.orgకు మెయిల్ చేయగలరు.

Updated Date - 2021-06-25T20:43:45+05:30 IST