రామకృష్ణ మఠం శిక్షణా తరగతుల డిసెంబర్ షెడ్యూల్

ABN , First Publish Date - 2020-12-02T23:02:37+05:30 IST

నగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ వివిధ శిక్షణా తరగతులకు సంబంధించి డిసెంబర్ నెల షెడ్యూల్‌ను విడుదల చేసింది.

రామకృష్ణ మఠం శిక్షణా తరగతుల డిసెంబర్ షెడ్యూల్

హైదరాబాద్: నగరంలోని రామకృష్ణ మఠానికి చెందిన ‘వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్’ వివిధ శిక్షణా తరగతులకు సంబంధించి డిసెంబర్ నెల షెడ్యూల్‌ను విడుదల చేసింది. కరోనా నేపథ్యంలో వర్చువల్ క్లాసులను మాత్రమే నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


మనస్సు నియంత్రణకు సంబంధించిన క్లాసులను డిసెంబర్ 7 నుంచి 12 వరకు జరపనుంది. ఆరు రోజుల పాటు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతి రోజు ఉదయం 8.30 గంటల నుంచి 9. 30 గంటల వరకు తరగతులు జరగనున్నాయి. 16 - 50 ఏళ్ల వయస్సు వారు మాత్రమే అర్హులు. 


యోగా శిక్షణా తరగతులు నాలుగు వారాల పాటు జరగనున్నాయి. డిసెంబర్ 7 నుంచి జనవరి 2 వరకు క్లాసులు జరుగుతాయి. ఉదయం 6.35 గంటల నుంచి 7.45 గంటల వరకు జరిగే ఈ క్లాసులకు వయో పరిమితి 16 - 50 ఏళ్లు. 


ఇదే తేదీలలో మహిళలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.  సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు వారికి క్లాసులు జరగనున్నాయి


భయాన్ని అధిగమించడంపై ఆరు రోజుల ప్రత్యేక తరగతులను ఈ నెల 14 నుంచి ప్రారంభించనున్నారు. 19 వరకు జరగనున్న ఈ తరగతులు సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల వరకు జరగనున్నాయి. మార్చి 12 నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు.  వయో పరిమితి 16 - 50 ఏళ్లు.


వ్యక్తిత్వ వికాస తరగతులు డిసెంబర్ 21 నుంచి 26 వరకు జరగనున్నాయి. సోమవారం నుంచి శనివారం వరకు. సాయంత్రం 6.15 గంటల నుంచి 7.15 గంటల వరకు జరగనున్నాయి. ఈ నెల 10 నుంచి అప్లికేషన్లు ప్రారంభం కానున్నాయి. వయో పరిమితి 16 - 50 ఏళ్లు.


కమ్యునికేషన్ స్కిల్స్  తరగతులు ఈ నెల 28 నుంచి జనవరి 2 వరకు జరగనున్నాయి. ఆరు రోజుల పాటు జరగనున్న ఈ తరగతులు ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు సాగుతాయి. ఈ నెల 15 నుంచి అప్లికేషన్లు తీసుకోనున్నారు. వయో పరిమితి 16 -50 ఏళ్లు.


ఏకాగ్రత, ధ్యానానికి సంబంధించిన తరగతులు ఈ నెల 28 నుంచి జనవరి 1 వరకు ఐదు రోజుల పాటు నిర్వహించనున్నారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు సాయంత్రం 6.15 నుంచి 7.15 వరకు జరగనున్నాయి. 16- 60 ఏళ్ల వారు మాత్రమే అర్హులు. ఈ నెల 15 నుంచి అప్లికేషన్లు స్వీకరించనున్నారు. 


వీటితో పాటు ‘అన్నమాచార్య సంకీర్తనలు’ రెండు నెలల ప్రత్యేక కోర్సును ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 13 వరకు క్లాసులు జరగనున్నాయి. శని, ఆదివారాల్లో జరిగే ఈ తరగతులు సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు జరగనున్నాయి. ఈ నెల 12 నుంచి అప్లికేషన్లు తీసుకోనున్నారు.  12 ఏళ్లకు పైబడిన వారే అర్హులు.  


మరిన్ని వివరాలకు 040-27627961, 9177232696 నెంబర్లలో సంప్రదించవచ్చని రామకృష్ణ మఠం ప్రతినిధులు తెలిపారు.



Updated Date - 2020-12-02T23:02:37+05:30 IST