Ramakrishna: తక్షణమే అంకబాబును విడుదల చేయాలి...

ABN , First Publish Date - 2022-09-23T19:27:09+05:30 IST

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) లేఖ రాశారు.

Ramakrishna: తక్షణమే అంకబాబును విడుదల చేయాలి...

విజయవాడ (Vijayawada): ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan)కి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ (Ramakrishna) లేఖ (Letter) రాశారు. సీనియర్ జర్నలిస్టు అంకబాబు (Ankababu)ను సీఐడీ (CID) పోలీసులు నిర్బంధించటాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు, సమాచారం లేకుండా అంకబాబును పోలీసులు బలవంతంగా తీసుకెళ్లటం దుర్మార్గమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తోందని, తక్షణమే అంకబాబును విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని  రామకృష్ణ ఆ లేఖలో పేర్కొన్నారు.


సీనియర్ జర్నలిస్ట్ అంకబాబును గత రాత్రి ఏపీ సీఐడీ పోలీసులు విజయవాడలో అదుపులోకి తీసుకున్నారు. వాట్సాప్‌ (Whatsapp)లో ప్రభుత్వ వ్యతిరేక పోస్టింగ్ పెట్టారని అంకబాబుపై అభియోగం... ఇటీవల ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత అంశంలో.. పోస్టింగ్ ఫార్వార్డ్ చేయడం వల్ల అంకబాబును సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.అంకబాబుపై మూడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టారని సీఐడీ పోలీసులు అభియోగం మోపుతూ ఐపీసీ 153(A), 505(2), రెడ్ విత్ 120B సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

Updated Date - 2022-09-23T19:27:09+05:30 IST