అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ఆదివారం లేఖ రాశారు. చెరకు రైతుల బకాయిలను చెల్లించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని లేఖలో డిమాండ్ చేశారు. చెరకు రైతులకు పరిశ్రమల యాజమాన్యాలు రూ 120 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. విశాఖ జిల్లా తాండవలో ఒక రైతు మరణించారని చెప్పారు.ఆందోళన చేపట్టిన చెరుకు రైతులపై పలుచోట్ల పోలీసులు అక్రమ కేసులు పెట్టారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు మీరు ఇచ్చిన హామీలు విస్మరించడం తగదని రామకృష్ణ అన్నారు.
ఇవి కూడా చదవండి