Agnipath కేసులో అరెస్ట్ అయిన బాధితులకు CPI అండగా ఉంటుంది: Ramakrishna

ABN , First Publish Date - 2022-06-21T20:14:38+05:30 IST

అగ్నిపధ్ కేసులో అరెస్ట్ అయిన బాధితులకు CPI అండగా ఉంటుందని రామకృష్ణ అన్నారు.

Agnipath కేసులో అరెస్ట్ అయిన బాధితులకు CPI అండగా ఉంటుంది: Ramakrishna

Guntur: అగ్నిపధ్ (Agnipath) కేసులలో అరెస్ట్ అయిన బాధిత కుటుంబాలను జిల్లా కోర్టులో సిపిఐ (CPI) నేతలు రామకృష్ణ, ముప్పాళ్ళ, జంగాల అజయ్ తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ (Ramakrishna) మాట్లాడుతూ అగ్నిపధ్ కేసులో అరెస్ట్ అయిన బాధితులకు సిపిఐ అండగా ఉంటుందన్నారు. బాధితులకు న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయిస్తామన్నారు. ఇలాంటి కేసుల వల్ల పోలీసు శాఖపై ఉండే గౌరవం పోతుందన్నారు. అగ్నిపధ్ కేసులపై మంత్రులు, ముఖ్య మంత్రి స్పందించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Updated Date - 2022-06-21T20:14:38+05:30 IST