ప్రజా ఉద్యమాలు అంటే జగన్‌కు అంత ఉలుకెందుకు?: Ramakrishna

ABN , First Publish Date - 2022-05-08T16:21:19+05:30 IST

ప్రజా ఉద్యమాల అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంత ఉలుకెందుకని రామకృష్ణ ప్రశ్నించారు.

ప్రజా ఉద్యమాలు అంటే జగన్‌కు అంత ఉలుకెందుకు?: Ramakrishna

Amaravathi: ప్రజా ఉద్యమాల అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అంత ఉలుకెందుకని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మోపాయని విమర్శించారు. ఈ నెల 9న సీపీఐ ఛలో అమరావతికి పిలుపునిస్తే రెండు రోజుల ముందు నుంచే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారని మండిపడ్డారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం.. సీపీఐ, ప్రజా సంఘాల నేతలకు నోటీసులు ఇవ్వటం, అరెస్టులు చేయడం దుర్మార్గమన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పెంచిన.. ఆస్తి, చెత్త పన్నులను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. వంట నూనెలు, నిత్యావసర వస్తువుల ధరలను అరికట్టాలని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలపై అధిక సుంకాల భారాన్ని తగ్గించాలన్నారు. అరెస్టు చేసిన సీపీఐ నేతలను తక్షణమే విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

Read more