Jul 31 2021 @ 12:29PM

క‌ళ్యాణ్‌రామ్ ‘డెవిల్’లో భాగ‌మ‌వుతున్న స్టార్ టెక్నీషియ‌న్స్‌

ఓ సినిమాకు కొత్త లుక్‌ను తీసుకురావ‌డం కోసం డైరెక్ట‌ర్‌తో క‌లిసి టెక్నీషియ‌న్స్ ప‌డే క‌ష్టం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ముఖ్యంగా పీరియాడిక్ మూవీ చేస్తున్న‌ప్పుడు మ‌రింత ఎక్కువ ఫోక‌స్‌గా ప‌నిచేయాల్సి ఉంటుంది. పీరియాడిక్ మూవీస్‌ను చేసేట‌ప్పుడు వాటికి అప్ప‌టి లుక్‌ను తీసుకురావ‌డంలో ఆర్ట్ డైరెక్ట‌ర్, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ పాత్ర‌లెంతో కీల‌కంగా ఉంటాయి. టాలీవుడ్‌లో ‘పుష్ప‌, రంగ‌స్థ‌లం, ఉప్పెన‌, త‌లైవి, అంత‌రిక్షం 9000 kmph’.. స‌హా ప‌లు చిత్రాల‌కు త‌మ ఆర్ట్ వ‌ర్క్‌తో ఓ డిఫ‌రెంట్ లుక్ తీసుకొచ్చిన ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ రామ‌కృష్ణ‌, మోనిక ఇప్పుడు డైన‌మిక్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మోస్ట్ అవెయిటింగ్ పీరియాడ్ ఫిల్మ్ ‘డెవిల్- ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ చిత్రంలో భాగ‌మ‌య్యారు.బ్రిటీష్ కాలానికి చెందిన క‌థాంశంతో రూపొందనున్న ఈ చిత్రాన్ని దేవాంశ్ నామా స‌మ‌ర్ప‌ణ‌లో  ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ మేడారం ద‌ర్శ‌క‌త్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. టాలీవుడ్‌లో ‘పుష్ప‌, రంగ‌స్థ‌లం, ఉప్పెన‌, త‌లైవి, అంత‌రిక్షం 9000 kmph’.. స‌హా ప‌లు చిత్రాల‌కు త‌మ ఆర్ట్ వ‌ర్క్‌తో ఓ డిఫ‌రెంట్ లుక్ తీసుకొచ్చిన ప్ర‌ముఖ ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ రామ‌కృష్ణ‌, మోనిక ఇప్పుడు డైన‌మిక్ స్టార్ నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ మోస్ట్ అవెయిటింగ్ పీరియాడ్ ఫిల్మ్ ‘డెవిల్- ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ చిత్రంలో భాగ‌మ‌య్యారు. 

ఈ పీరియాడిక్ మూవీ కోసం.. 1945లో బ్రిటీష్ వాళ్లు ప‌రిపాలించిన మద్రాస్ ప్రెసిడెన్సీ సెట్‌ను ఈ సినిమా కోసం రామ‌కృష్ణ‌, మోనిక రూపొందించ‌నున్నారు. ఎవ‌రికీ తెలియ‌ని ఓ ర‌హ‌స్యాన్ని ఛేదించ‌డానికి నియ‌మించ‌బ‌డ్డ ర‌హ‌స్య గూఢ‌చారే ‘డెవిల్‌’. ఈ ర‌హ‌స్యం అత‌ను ఊహించిన దాని కంటే మ‌రింత లోతుగా ఉంటుంది. ఈ ప్ర‌యాణంలో అత‌ను ప్రేమ‌, మోసం, ద్రోహం అనే వ‌ల‌యాల్లో ఎలా చిక్కుకున్నాడు. ఈ మిస్ట‌రీ క‌థానాయ‌కుడి జ‌యాప‌జ‌యాల‌పై తీవ్ర ప‌రిణామాల‌ను చూపేలా ఉంటుంది. చ‌రిత్ర గ‌తిని మార్చేంత సామ‌ర్థాన్ని క‌లిగి ఉంటుంది.  రీసెంట్‌గా నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. సీక్రెట్ బ్రిటీష్ ఏజెంట్ పాత్ర‌లో క‌ళ్యాణ్‌రామ్ ఇది వ‌ర‌కెప్పుడూ చేయ‌ని స‌రికొత్త లుక్‌లో క‌నిపిస్తుండ‌టం విశేషం.