Ramaiah Narayana Heart Centre: 14 ఏళ్ల బాలుడికి గుండెమార్పిడి శస్త్రచికిత్స

ABN , First Publish Date - 2022-05-13T01:41:54+05:30 IST

బెంగళూరులోని రామయ్య నారాయణ హార్ట్ సెంటర్ (Ramaiah Narayana Heart Centre) అత్యంత అరుదైన

Ramaiah Narayana Heart Centre: 14 ఏళ్ల బాలుడికి గుండెమార్పిడి శస్త్రచికిత్స

బెంగళూరు: బెంగళూరులోని రామయ్య నారాయణ హార్ట్ సెంటర్ (Ramaiah Narayana Heart Centre) అత్యంత అరుదైన ఘనత సాధించింది. ఏపీలోని అనంతపురం జిల్లా దిమ్మగుడికి చెందిన 14 ఏళ్ల అనిల్ కుమార్‌కు గుండెమార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించింది. ఈ ఆసుపత్రిలో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకున్న 42వ రోగిగా అనిల్ కుమార్ రికార్డులకెక్కాడు. 


అనిల్ మూడునాలుగు నెలలుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. స్థానిక ఆసుపత్రుల్లో చూపించినప్పటికీ ఫలితం లేకపోయింది. మరోవైపు, అతడి పరిస్థితి రోజురోజుకు మరింతగా దిగజారింది. కూర్చుని ఉంటే తప్ప శ్వాస తీసుకోలేని పరిస్థితికి చేరుకున్నాడు. స్వగ్రామానికే చెందిన డాక్టర్ నాగమల్లేష్ నేతృత్వంలో బాలుడిని బెంగళూరులోని రామయ్య నారాయణ హార్ట్‌ సెంటర్‌‌కు తరలించారు. 


అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్ప మరో అవకాశం లేదని తేల్చిచెప్పారు. జీవసార్థకత వద్దగుండె మార్పిడి కోసం నమోదు చేసుకోమని సూచించారు. ఈ క్రమంలో వారికి 46  రోజుల్లోనే అనిల్‌కు సరిపడా గుండె లభించింది. బెంగళూరుకు చెందిన 26 ఏళ్ల  యువకుడు ఆసుపత్రిలో తీవ్రంగా గాయపడ్డాడు. వైద్యులు అతడిని బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారించడంతో అతడి కుటుంబ సభ్యులు అవయవదానం చేసేందుకు ముందుకొచ్చారు. దీంతో అనిల్‌కు పునర్జన్మ లభించింది.


రామయ్య నారాయణ  హార్ట్‌ సెంటర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ నాగమల్లేష్‌, కార్డియోథొరాకిక్‌ సర్జన్‌ డాక్టర్‌ రవిశంకర్‌ శెట్టి, డాక్టర్‌ గోవర్థన్‌, డాక్టర్‌ ప్రశాంత్‌ రామమూర్తితో పాటుగా కార్డియాక్‌ అనస్తీషియాలజిస్ట్‌ డాక్టర్‌ గురు పోలీస్‌ పాటిల్ శస్త్రచికిత్స నిర్వహించారు. ఆపరేషన్ విజయవంతం కావడంతో అనిల్ వేగంగా కోలుకున్నాడు. 


ఈ సందర్భంగా హార్ట్‌ ఫెయిల్యూర్‌ కన్సల్టెంట్‌ అండ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్ యూఎం నాగమల్లేష్ మాట్లాడుతూ.. తీవ్రమైన ఎడమ జఠిరిక పనిచేయకపోవడంతో డైలేటెడ్ కార్డియోమయోపతి అనేది మరణాలకు దారితీస్తుందని అన్నారు. ఈ తరహా స్థితికి గుండె మార్పిడి ఒక్కటే పరిష్కారమని అన్నారు. గుండెమార్పిడి చేయించుకున్న బాలుడు అనిల్ కుమార్ వేగంగా కోలుకుంటున్నట్టు చెప్పారు. తమ కుమారుడికి పునర్జన్మ ప్రసాదించిన రామయ్య నారాయణ హార్ట్ సెంటర్‌కు అనిల్ కుమార్ తండ్రి కృతజ్ఞతలు తెలిపారు. డం మాత్రమే కాదు అతను తిరిగి ఆరోగ్యం పొందేందుకు సైతం సహాయపడ్డారు. వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’’ అని అన్నారు.

Read more