రామగుండం రాజకీయాల్లో ‘సబ్‌ప్లాన్‌’ రగడ

ABN , First Publish Date - 2021-01-25T06:18:14+05:30 IST

ఎన్నికలు లేకున్నా రామగుం డంలో రాజకీయ వేడి మొదలైంది.

రామగుండం రాజకీయాల్లో ‘సబ్‌ప్లాన్‌’ రగడ
నిరసన తెలుపుతున్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లు(ఫైల్‌)

- కార్పొరేషన్‌ వేదికగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ యుద్ధం 

- అర్ధరాత్రి వరకు కాంగ్రెస్‌ నిరసన 

- కౌన్సిల్‌ హాల్‌లోకి పోలీసుల ప్రవేశంపై ఆక్షేపణలు 

- ప్రేక్షక పాత్రలో కలెక్టర్‌, కమిషనర్‌

కోల్‌సిటీ, జనవరి 24: ఎన్నికలు లేకున్నా రామగుం డంలో రాజకీయ వేడి మొదలైంది. ఎస్సీ సబ్‌ప్లాన్‌ ర గడ రామగుండాన్ని కుదిపివేస్తోంది. కార్పొరేషన్‌ వేదికగా కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌లు రాజకీయ యుద్ధ వాతావరణాన్ని తీసుకువచ్చాయి. చట్టబద్ధత ఉన్న ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల కేటాయింపుల్లో వివక్ష ప్రదర్శించార ని ఆరోపిస్తూ కాంగ్రెస్‌ ఆందోళనకు దిగింది. కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశానికి ముందు ఇన్‌చార్జి కలెక్టర్‌ కార్పొరేషన్‌పై మానిటరింగ్‌ అథారిటీ హోదాలో పర్యవేక్షిస్తున్న భారతి హోళికేరికి వినతిపత్రం ఇచ్చేం దు కు కాంగ్రెస్‌ కార్పొరేటర్లు మంచిర్యాలకు వెళ్లారు.ఆమె తీసుకునేందుకు నిరాకరించడంతో క్యాంపు కార్యాల యం ఎదుట బైఠాయించారు. వారిని పోలీసులు అరె స్టుచేశారు. దీంతో వివాదం మరింత ముదిరింది. 

కేటాయింపుల్లో వివక్షపై వివాదం..

రామగుండం నగరపాలక సంస్థకు ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధుల నుంచి రూ.12.55కోట్లు మంజూరయ్యాయి. ఇందులో నుంచి రూ.9.8కోట్లను 43డివిజన్లలో ప్రతిపాదించారు. కాగా చట్టబద్దత ఉన్న ఎస్సీ సబ్‌ప్లాన్‌ లో 60శాతం నిధులు ఎస్సీ జనాభా అధికంగా ఉన్న ప్రాంతాల్లో వెచ్చించాలి. రామగుండం మున్సిపల్‌ కా ర్పొరేషన్‌లో ఎస్సీ రిజర్వు చేయబడిన డివిజన్లలో టీ ఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ఉన్నచోట ఎక్కువ నిధులు, కాం గ్రెస్‌ ఉన్నచోట తక్కువ నిధులు కేటాయించారు. ము ఖ్యంగా కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తు న్న డివిజన్లలో అత్యధిక ఎస్సీ జనాభా ఉన్న డివిజన ్లలో నిధులు కేటాయించకుండా, తక్కువ ఎస్సీ జనా భా ఉండి బీసీ, జనరల్‌ రిజర్వు అయిన డివిజన్లు, సింగరేణి పరిధి కాలనీలు ఉన్న డివిజన్లు, వ్యాపార కేంద్రాల్లో ఎస్సీ సబ్‌ప్లాన్‌ నిధులు పెట్టారనే ఆరోపణ లు వివాదాన్ని రేకెత్తించాయి. రూ.12.55కోట్లు మం జూరైతే కేవలం రూ.9.8 కోట్లు మాత్రమే కేటాయించారు. మరో రూ.2కోట్లకు పైగా నిధులు అందుబాటు లో ఉన్నా ఎస్సీ డివిజన్లకు కేటాయించకపోవడం మ రింత వివాదానికి కారణమైంది. 

సమన్వయ లోపంతోనే..

రామగుండం నగరపాలక సంస్థలో గతంలో ఎన్న డూ లేని విధంగా ఈ పాలకవర్గంలో అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులకు సమన్వయంలేదు. ము ఖ్యంగా చీఫ్‌ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా వ్యవహరించే క మిషనర్‌కు కార్పొరేటర్లకు మధ్య అగాధమే ఉంది. గతంలో మున్సిపాలిటీగా ఉన్న సమయం నుంచి క మిషనర్లుగా వ్యవహరించిన వారు అధికార, విపక్ష కార్పొరేటర్లతో సమన్వయం సాధించేవారు. నిధుల కే టాయింపుల్లో వివాదాలు లేకుండా చూసేవారు. కేటాయింపుల్లో ఏదైనా వ్యత్యాసాలు ఉన్నా మరో స్కీమ్‌ నిధులతో సరిచేసేవారు. అధికారులపై ఆరోపణలు వచ్చిన సందర్భంలో కూడా కార్పొరేటర్లతో చర్చించి సమన్యలను పరిష్కరించేవారు. రామగుండంలో కౌ న్సిల్‌ వేదికగానే అధికార యంత్రాంగంపై కార్పొరేట ర్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. కార్పొరేటర్లు అంటే అధికారులకు తెలియని పరిస్థితి ఉందని వాపోతున్నారు. అధికార పార్టీ కార్పొరేటర్లే మా ఫోన్లు ఎవరూ ఎత్తరంటూ మూకుమ్మడిగా వినతిపత్రాలు ఇ వ్వాల్సిన దుస్థితి ఏర్పడింది. సబ్‌ప్లాన్‌ నిధులకు సం బంధించి కేటాయింపుల సమయంలోనే కమిషనర్‌ అధికార, విపక్ష కార్పొరేటర్లతో చర్చించాల్సి ఉంది. గతంలో ఈ సాంప్రదాయాన్ని కొన సాగించేవారు. ఏమైనా చిన్నచిన్న వివాదాలు ఉంటే పరిష్కరించేవారు. కలెక్టర్‌ బంగ్లా వద్ద కాంగ్రెస్‌ కార్పొరేటర్లు ధర్నా చేసిన సందర్భంలో వా రిని చర్చలకు ఆహ్వానించి పరిష్కరించలేక కమిషనర్‌ చేతులెత్తేశారనే ప్రచారం జరుగుతోంది. ఇటు శాస నసభ్యుడు, మేయర్‌, విపక్ష కార్పొరేటర్లను సమన్వయపర్చడంలో చొరవ తీసుకోకపోవడం వల్లే కౌన్సిల్‌ సమావేశం రణరంగంగా మారిందనే వాదన వినిపిస్తోంది. ఎజెండాలో వి వాదాస్పదమైన అంశాలు వస్తున్నా వారించడం లేదనే పరిస్థితి ఉంది. ఏడేళ్ల క్రితం కౌన్సి ల్‌ సాధారణ సమావేశంలో అభ్యంతరాలతో అమృత్‌ కన్సల్టెంట్‌ బిల్లులను పెండింగ్‌లో పెట్టారు. దీనిపై విజిలెన్స్‌ విచారణ జరిగింది. ఇదే సంస్థకు రూ.40లక్షల బిల్లు చెల్లించేందుకు టేబుల్‌ ఎజెండాగా మేయర్‌ ద్వారా అధికార యంత్రాంగం ప్రతిపాదించడం అను మానాలకు తావిస్తోంది.

పోలీసుల ప్రవేశంపై ఆగ్రహం..

మున్సిపల్‌ చట్టం ప్రకారం మున్సిపల్‌ సాధారణ సమావేశంలో సభ్యులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే మేయర్‌ చర్య తీసుకునే అవకాశం ఉంటుం ది. మున్సిపల్‌ చట్టం 2019 సెక్షన్‌ 40(1),(2), (3) నిబంధనల ప్రకారం ఈ చర్యలకు అవకాశం ఉంది. శాంతికి విఘాతం కలిగించే సభ్యుడిని ఒకరోజు స స్పెండ్‌ చేస్తారు. అప్పటికీ సభ్యుడు వెళ్లకపోతే సి బ్బందితో బయటకు పంపుతారు. మరీ వివాదం ఎ క్కువ అయితే సమావేశాన్ని మూడు రోజులు వాయి దా వేయాల్సి ఉంటుంది. అంతేకానీ పోలీసులను పిలిచే పరిస్థితి ఉండదు. కానీ పోలీసులు ఏకంగా స మావేశ మందిరంలో మోహరించడం, సభ్యులను నె ట్టడంవంటి చర్యలు పూర్తి వివాదాస్పదమయ్యాయి. శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించిన అనుభవం ఉన్న కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఈ వ్య వహారంపై ఘాటుగా స్పందించారు. 

మున్సిపల్‌ మంత్రిని వివాదంలోకి..

ఎస్సీ సబ్‌ప్లాన్‌కు చట్టబద్దత ఉండడం, నిధుల కేటాయింపుల్లో వివక్షపై మున్సిపల్‌ మంత్రి హోదాలో కేటీఆరే బాధ్యత వహించాలని కాంగ్రెస్‌ అతన్ని వివాదంలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. మున్సిపల్‌లోకి పోలీసులు ప్రవేశించడం, కార్పొరేటర్లను అరెస్టు చేసి అర్ధరాత్రి తిప్పడంవంటి చర్యలు మరింత వివాదాన్ని రేకెత్తిస్తున్నాయి. 

ఏడాదిలో చర్చ లేదు..

రామగుండం నగరపాలక సంస్థలో ఏడాది కాలం లో జరిగిన సమావేశాల్లో ఎక్కడా చర్చ జరిగిన పరిస్థితి లేదు. కరోనా వల్ల సాధారణ సమావేశాలే నిర్వహించలేదు. అత్యవసర సమావేశాలు నిర్వహించినా సమస్యలపై చర్చ జరగకుండా గొడవలు జరిగాయి. మొదటి సాధారణ సమావేశంలోనే అదే పరిస్థితి. కా ర్పొరేటర్లు తమ సమస్యలను ఎక్కడ చెప్పుకోవాలో తెలియని పరిస్థితి. తాము కనీసం వీధిదీపాలు పె ట్టించలేని పరిస్థితిలో ఉన్నామంటూ అధికార పార్టీ కార్పొరేటర్లు కమిషనర్‌కు మొరపెట్టుకోవడం కార్పొరేషన్‌లో దిగజారిన పరిస్థితులకు అద్దం పడుతోంది. గతంలో ఇలాంటి పరిస్థితులు లేవని మాజీ ప్రజాప్ర తినిధులు పేర్కొంటున్నారు. 

రాజకీయ కలకలం..

రామగుండంలో పార్టీలు వేరైనా నాయకులు స్నే హపూర్వకంగా ఉంటారు. శుభాశుభకార్యాలకు తోడు గా ఉంటారు. కార్పొరేషన్‌ వివాదాలతో అధికార, విపక్ష పార్టీల్లోని నాయకులు వ్యక్తిగత ఆరోపణలు, దూషణలకు దిగుతున్నారు. ఈ పరిస్థితులు ఇక్కడ రాజీయాల్లో స్నేహపూర్వక వాతావరణాన్ని కలుషితం చే స్తున్నాయి. ఇప్పటికే రామగుండం కార్పొరేటర్లలో ము ఖ పరిచయాలు లేవనే ప్రచారం కూడా ఉంది. 

Updated Date - 2021-01-25T06:18:14+05:30 IST