Abn logo
May 26 2020 @ 00:00AM

ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు

కడప(కల్చరల్‌), మే 25 : కరోనా సర్వమతాలపై ప్రభావం చూపుతోంది. అన్ని మతాల వారూ అన్ని రకాల పండుగలనూ ఇళ్లకే పరిమితమై చేసుకుంటున్నారు. రంజాన్‌ ప్రార్థనలు సైతం సోమవారం ముస్లింలు ఇళ్లలోనే భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఈద్గాలకు వెళ్లకుండా, అందరూ ఇళ్లలోనే సామాజిక దూరం పాటిస్తూ కుటుంబసభ్యులతో ప్రార్థనలు జరిపారు. కరోనా వైరస్‌ త్వరగా తొలగి పోవాలని గురువులు ప్రార్థనలు చేశారు. ఈద్గాలు వెలవెలపోయాయి. గృహాలు కళకళలాడాయి. భక్తి మాత్రం వెల్లివిరిసింది.

Advertisement
Advertisement
Advertisement