ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు

ABN , First Publish Date - 2020-05-25T09:16:35+05:30 IST

రంజాన్‌ పండ గ ప్రార్థనలన్నీ ఇళ్లలోనే నిర్వహించుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి

ఇళ్లలోనే రంజాన్‌ ప్రార్థనలు

అనంతపురం క్లాక్‌టవర్‌, మే 24 :  రంజాన్‌ పండ గ ప్రార్థనలన్నీ ఇళ్లలోనే నిర్వహించుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ అధికారి మహ్మద్‌రఫీ, వక్ఫ్‌బోర్డ్‌ ఇన్‌ స్పెక్టర్‌ ఇనయతుల్లా తెలిపారు. ప్రభుత్వ నిబంధనలు, సూచనలకు సంబంధించిన ఉత్తర్వులను ఆయన ఆదివారం మతపెద్దలు, మసీదులకు పంపించారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రార్థనలు ఇళ్లలోనే నిర్వహించుకోవాలని సూచించారు. ఇమాం, మౌజాన్‌లతో పాటు ముగ్గురు కమిటీ సభ్యులు మొత్తం ఐదుగురిని మాత్రమే మసీదులలో ప్రార్థనలకు అనుమతిస్తామన్నారు. ఇళ్లకు బంధుమిత్రులను ఆహ్వానించడం, హత్తుకోవడం, కరచాలనం నిర్వహించడాన్ని ప్రభుత్వం నిషేధించిందన్నారు. మసీదులు, ఈద్గాలు, దర్గాల యాజమాన్యాలు ప్రభుత్వ ఆదేశాలు తప్పక పాటించాలని కోరారు. 

Updated Date - 2020-05-25T09:16:35+05:30 IST