నోరూరించే రంజాన్‌ దావత్‌...

ABN , First Publish Date - 2020-05-25T04:58:23+05:30 IST

ఈద్‌ పండుగ సందడి మొదలైంది. ఇక రంజాన్‌ వేడుక వంటలు బహు పసందుగా ఉంటాయని వేరే చెప్పాలా. అందులోనూ షీర్‌ ఖుర్మా, డ్రైఫ్రూట్స్‌ స్టఫ్డ్‌ డేట్స్‌ స్వీటు రంజాన్‌ స్పెషల్స్‌. వీటి పేర్లు వింటేనే నోట్లో నీరూరుతుంది.

నోరూరించే రంజాన్‌ దావత్‌...

ఈద్‌ పండుగ సందడి మొదలైంది. ఇక రంజాన్‌ వేడుక వంటలు బహు పసందుగా ఉంటాయని వేరే చెప్పాలా. అందులోనూ షీర్‌ ఖుర్మా, డ్రైఫ్రూట్స్‌ స్టఫ్డ్‌ డేట్స్‌ స్వీటు రంజాన్‌ స్పెషల్స్‌. వీటి పేర్లు వింటేనే నోట్లో నీరూరుతుంది. రంజాన్‌ రోజున ఇవి మీకోసం...


షీర్‌ ఖుర్మా

కావలసినవి: అరలీటరు పాలు, బాదం, పిస్తా, జీడిపప్పు, ఖర్జూరం, సారపప్పు డ్రైఫ్రూట్స్‌, నెయ్యి, సన్న సేమ్యా, చక్కెర, జీడిపప్పు+బాదం పేస్టు చిన్నకప్పుడు.


తయారీ:

ముందుగా అరలీటరు పాలు తీసుకుని ఒక బౌల్‌లో బాగా మరగనివ్వాలి.

పాలు మరిగేలోపు ఇంకో పాన్‌లో నెయ్యి వేసి డ్రైఫ్రూట్స్‌ అన్నిటిని వేగించాలి. పాన్‌లో రెండు స్పూన్లు నెయ్యి వేసి అది వేడెక్కాక అందులో నానబెట్టిన బాదం పప్పు ముక్కలు (రాత్రి బాదంపప్పులు నీళ్లల్లో నానబెట్టాలి), జీడిపప్పు, పిస్తా, సారపప్పు, సన్నగా తరిగిన ఖర్జూరాలు వేసి వేగించాలి. 


డ్రైఫ్రూట్స్‌ వేగించిన పాన్‌లోనే సన్న సేమ్యాను బ్రౌన్‌ రంగులోకి వచ్చేవరకూ వేగించాలి.

బాగా మరిగిన పాలలో ముప్పావు కప్పు చక్కెర వేసి సన్నని మంటపై కలయబెట్టాలి. అందులో వేగించి పెట్టుకున్న డ్రైఫ్రూట్స్‌ వేయాలి. సేమ్యా కూడా వేసి కలపాలి.


విడిగా నానబెట్టిన జీడిపప్పు, బాదం పప్పులను కలిపి పేస్టులా చేయాలి. ఆ పేస్టును మరిగిన పాలల్లో వేసి  కలపాలి. ఆ మిశ్రమంలో కొద్దిగా యాలకుల పొడి వేయాలి. పాలల్లో రెండు స్పూన్ల మిల్క్‌మెయిడ్‌ కూడా వేసి సన్నని సెగపై కాసేపు ఉంచి దించాలి. అంతే... షీర్‌ ఖుర్మా రెడీ. దీన్ని తింటూ తీయ తీయగా ఈద్‌ను ఎంజాయ్‌ చేయండి.

Updated Date - 2020-05-25T04:58:23+05:30 IST