Abn logo
May 15 2021 @ 00:51AM

భక్తిప్రపత్తులతో రంజాన్‌ వేడుకలు

బోధన్‌ బస్టాండ్‌ సమీపంలోని ఈద్గాలో ప్రార్థనలు చేసి వస్తున్న ముస్లింలు

కరోనా వల్ల నిరాడంబరంగా పండుగ
నిజామాబాద్‌కల్చరల్‌, మే 14: ముస్లింలు పరమపవిత్రంగా భావించే రంజాన్‌ పండుగను శుక్రవారం జి ల్లాలో భక్తిప్రపత్తులతో జరుపుకొన్నారు. రంజాన్‌ పం డుగలో ముఖ్యమైన ప్రత్యేక ప్రార్థనలను శ్రద్ధతో నిర్వహించారు. కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌ నియమాలను పాటిస్తూ ముస్లిం మత పెద్దలు మసీదులలో పరిమిత సంఖ్యలో నమా జ్‌ నిర్వహించగా.. మిగతా వారు ఇళ్లలోనే నమాజ్‌ చే శారు. ప్రజలంతా సుఖశాంతులతో, పాడిపంటలతో చ ల్లగా ఉండాలని వేడుకుంటూ ప్రార్థనలు నిర్వహించా రు. ముస్లింలు అత్యంత సన్నిహితులను మాత్రమే ఇ ళ్లకు పిలుచుకుని విందు ఇచ్చారు. ఒకరికొకరు పండు గ శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాయ్‌బలాయ్‌ చే సుకున్నారు. ఉదయం ప్రారంభమైన రంజాన్‌ వేడుక లు సాయంత్రం వరకు కొనసాగాయి. ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రసిధ్ధ మసీదులతో పాటు గ్రామాల్లో ము స్లిం మత పెద్దలు కరోనా వైరస్‌ మహమ్మారి తొలగిపోవాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement