అన్నవరపు రామస్వామికి అభినందన

ABN , First Publish Date - 2021-01-27T06:37:02+05:30 IST

అన్నవరపు రామస్వామికి అభినందన

అన్నవరపు రామస్వామికి అభినందన
రామస్వామికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న బాలస్వామి

గవర్నర్‌పేట, జనవరి 26: పద్మశ్రీ పుర స్కారం దక్కించుకున్న నగరానికి చెందిన ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామిని మంగళవారం పలువురు సూర్యారావుపేటలో ఆయన స్వగృహంలో కలిసి అభినందనలు తెలిపారు. టీడీపీ 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ అభ్యర్థి నెల్లిబండ్ల బాలస్వామి, వైసీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి ఆత్మకూరి సుబ్బారావు(సురేష్‌) వేర్వేరుగా పుష్పగుచ్ఛాలు అందజేశారు. 

సంగీత కళాకారులకు గర్వకారణం

వన్‌టౌన్‌: ప్రముఖ వయోలిన్‌ విద్వాంసుడు అన్నవరపు రామస్వామికి పద్మశ్రీ లభించటం దేశంలోని సంగీత కళాకారులందరికి గర్వకా రణమని రాఘవేంద్ర పబ్లిషర్స్‌ నిర్వాహకుడు దిట్టకవి రాఘవేంద్రరావు అన్నారు. రామస్వామిని రాఘవేంద్రరావు, రచయిత డాక్టర్‌ కె.రామకృష్ణ అభినందించారు.


Updated Date - 2021-01-27T06:37:02+05:30 IST