Abn logo
Aug 5 2020 @ 21:00PM

జెనీలియాకు రామ్ బర్త్‌డే విషెస్!

టాలీవుడ్ యంగ్ హీరో రామ్, హీరోయిన్ జెనీలియా మంచి స్నేహితులు. వీరిద్దరూ కలిసి గతంలో `రెడీ` సినిమాలో నటించారు. అప్పుడు మొదలైన వీరి స్నేహం ఇప్పటికీ కొనసాగుతోంది. జెనీలియా ఫ్యామిలీతో కూడా రామ్‌కు మంచి అనుబంధముంది. ఈ రోజు (బుధవారం) జెనీలియా జన్మదినోత్సవం.


ఈ సందర్భంగా రామ్ ట్విటర్ ద్వారా జెనీలియాకు బర్త్‌డే విషెస్ తెలియజేశాడు. `నిస్వార్థమైన, మంచి మనసు కలిగిన ఫ్రెండ్ జెనీలియాకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం నీకు మరింత ఉత్తమంగా ఉండాలని ఆశిస్తున్నాను. త్వరలోనే మనందరం మళ్లీ కలుద్దామ`ని రామ్ ట్వీట్ చేశాడు. గతంలో జెనీలియా ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఫొటోను పోస్ట్ చేశాడు. రామ్ ట్వీట్‌కు జెనీలియా ధన్యవాదాలు తెలిపింది. Advertisement
Advertisement
Advertisement