టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'ది వారియర్' (The Warriorr). తాజాగా చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజై విశేషంగా ఆకట్టుకుంటుంది. కోలీవుడ్ అగ్ర దర్శకుడు ఎన్.లింగుస్వామి (N.Lingu Samy) తెరకెక్కించిన ఈ బైలింగ్విల్ మూవీలో రామ్ సరసన కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే, షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్‌లో స్పీడ్ పెంచారు. 'ది వారియర్' చిత్రం నుంచి ఇప్పటికే వచ్చిన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ క్రమంలో తాజాగా థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీను (Boyapati Srinu) తెలుగు ట్రైలర్‌ను రిలీజ్ చేయగా.. కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ (Siva Karthikeyan) తమిళ్ ట్రైలర్‌ను విడుదల చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఈ ట్రైలర్లో డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. రామ్ యాటిట్యూడ్ చూస్తుంటే మరో 'ఇస్మార్ట్ శంకర్' వంటి హిట్ అందుకుంటాడనిపిస్తోంది. ఇక ట్రైలర్ విషయానికొస్తే..
'ఒక చెట్టు మీద 40 పావురాలు ఉన్నాయి..
దాంట్లో ఒక్క పావురాన్ని కాలిస్తే.. ఇంకా ఎన్ని ఉంటాయి? అన్నీ ఎగిరిపోతాయి'..
అంటూ రామ్ రౌడీ మూకల్లో ఒకరిని షూట్ చేయడంతో ఈ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్‌గా రామ్ అదరగొట్టాడు. కర్నూల్ డీఎస్పీగా ఛార్జ్ తీసుకున్న రామ్.. ఒంటి మీద యూనిఫామ్ లేకపోయినా ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉంటానని హెచ్చరిస్తున్నాడు. వర్సటైల్ యాక్టర్ ఆది పినిశెట్టి (Adi Pinishetty) క్రూరమైన విలన్ గురు పాత్రలో నటించాడు.
మనిషి అనేవాడు బలంతో బ్రతకాలి లేదా భయంతో బ్రతకాలి..
మర్డర్లు చేయడానికి నేను మతాలను చూడను..
అని రాయలసీమ యాసలో వార్నింగ్ ఇవ్వడంతో ఆది పినిశెట్టి పాత్రను పరిచయం చేసారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ అయిన రామ్.. శక్తివంతమైన ప్రతినాయకుడు ఆది మధ్య జరిగే వారే 'ది వారియర్' అని ఈ థియేట్రికల్ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇక ఇందులో నటించిన హీరోయిన్ కృతి శెట్టి ఆర్జే(రేడియో జాకీ)గా కనిపించబోతుంది. ఈ సినిమాను పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మరి రామ్ కి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ఇస్తుందో చూడాలి.