Chitrajyothy Logo
Advertisement
Published: Mon, 17 Jan 2022 12:40:34 IST

RAPO19కు ఇంట్రెస్టింగ్ టైటిల్

twitter-iconwatsapp-iconfb-icon

ఎనర్టిటిక్ స్టార్ రామ్ పోతినేని.. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ‘రెడ్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించాడు. డ్యూయల్ రోల్ చేసినప్పటికీ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ప్రస్తుతం రామ్ ఒకే ఒక సినిమాపై ప్రధానంగా ఫోకస్ పెట్టాడు. RAPO19గా వ్యవహరిస్తోన్న ఈ సినిమాని తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో చిత్రం విడుదల కానుంది. దీనికి ‘ది వారియర్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ను ఖాయం చేస్తూ ట్విట్టర్ లో ప్రకటించారు మేకర్స్. ఇందులో రామ్ పోలీస్‌ఆఫీసర్ గా నటిస్తున్నాడు. క్లీన్ షేవ్ తో పోలీస్ యూనిఫామ్‌లో అగ్రెసివ్ గా చూస్తున్న రామ్ లుక్ ఆకట్టుకుంటోంది. 


పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాస సిల్వర్ స్ర్కీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రన్, పందెంకోడి సిరీస్, సికందర్’ చిత్రాలతో కోలీవుడ్ ప్రేక్షకుల్ని మెప్పించిన లింగుసామి.. ఈ సినిమాతో రామ్‌ని యాంగ్రీ యంగ్ మేన్ గా మార్చబోతున్నాడు. తన కెరీర్‌లోనే మొట్టమొదటి సారిగా పోలీస్ యూనిఫామ్ తొడిగిన రామ్ కి ‘ది వారియర్’ చిత్రం ఏ స్థాయిలో పేరు తెస్తుందో చూడాలి.  


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement