Chitrajyothy Logo
Advertisement
Published: Sat, 14 May 2022 09:30:13 IST

Ram - Harish Shankar: క్రేజీ కాంబో సెట్..?

twitter-iconwatsapp-iconfb-icon

టాలీవుడ్‌లో ఓ క్రేజీ కాంబో సెట్ అయిందా..! అంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు చూస్తే అవుననిపిస్తోంది. ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) - స్టార్ డైరెక్టర్ హరిష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్‌లో సాలీడ్ మాస్ ఎంటర్ టైనర్ తెరకెక్కనుందని తాజా సమాచారం. రామ్ ఎనర్జీని దృష్టిలో పెట్టుకొని పక్కా కమర్శియల్ అంశాలతో అదిరిపోయే స్ర్కిప్ట్  సిద్దం చేసినట్టు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. 'ఇస్మార్ట్ శంకర్' (Ismart Shankar) భారీ హిట్ తర్వాత మళ్ళీ అలాంటి మాస్ హిట్ కొట్టాలని 'రెడ్' (Red) చిత్రాన్ని చేస్తే అదికాస్త బెడిసికొట్టింది.

దాంతో ఈసారి మళ్ళీ హిట్ కొట్టాలనే కసితో కోలీవుడ్ యాక్షన్ చిత్రాల దర్శకుడిగా పేరున్న ఎన్. లింగుస్వామి (N Linguswami) దర్శకత్వంలో 'ది వారియర్' (The Warrior) అనే యాక్షన్ మూవీని చేస్తున్నాడు. తెలుగుతో పాటుగా తమిళంలోనూ ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ మూవీలో హీరోయిన్స్‌గా కృతిశెట్టి (Krtishetty), అక్షర గౌడ..ఇతర కీలక పాత్రల్లో ఆదిపినిశెట్టి, నదియా కనిపించబోతున్నారు. అలాగే, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో కూడా ఎనర్జిటిక్ స్టార్ ఓ యాక్షన్ చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ క్రమంలోనే హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా హరీష్ శంకర్ భవదీయుడు భగత్‌సింగ్ (Bhavadeeyudu Bhagath Singh) చిత్రాన్ని చేయాల్సి ఉంది. జూలై నుంచి ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమాలో పవన్ సరసన మోస్ట్ వాంటెడ్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించబోతుంది. దీని తర్వాత రామ్ - హరీష్ శంకర్‌ల సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానుందని తెలుస్తోంది.

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement