Oct 28 2021 @ 18:36PM

అంటే వాళ్లు అసమర్థులా..? అందరూ ఖరీదైన లాయర్లను పెట్టుకోలేరుగా.. Aryan Khan బెయిల్‌పై RGV కామెంట్స్

బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రావడంతో సోషల్ మీడియా వేదికగా సినీ ఇండస్ట్రీకి చెందిన వారు స్పందిస్తున్నారు. గతంలోను ఆర్యన్ అరెస్టు అయినప్పుడు అనేక మంది బాలీవుడ్ ప్రముఖులు తమ మద్దతును తెలిపారు.


ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రావడంతో మాధవన్, సోనూసూద్, స్వర భాస్కర్, రామ్ గోపాల్ వర్మ తదితరులెందరో స్పందించారు. ‘‘ దేవునికి దన్యవాదాలు. తండ్రిగా నేను ఉపశమనం పొందాను. అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను ’’ అని మాధవన్ ట్వీట్ చేశారు. ‘‘ ప్రత్యక్ష సాక్షులు అవసరం లేదు. న్యాయం గెలుస్తుందని కాలమే చెబుతోంది’’ అని ట్విట్టర్‌లో సోనూ సూద్ పేర్కొన్నారు.    


వివాదాలతో వార్తల్లో నిలిచే విలక్షణ  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ‘‘ ముకుల్ రొహత్గీ వాదనలతోనే ఆర్యన్‌కు బెయిల్ లభించింది. గతంలో ఆర్యన్ తరపున వాదించిన లాయర్లు అసమర్థులా. అందుకే ఆర్యన్ ఇన్ని రోజులు జైలులో గడపాల్సి వచ్చింది. దేశంలోని చాలామంది ప్రజలు ముకుల్ రొహత్గీ లాంటి ఖరీదైన లాయర్లను నియవించుకోలేరు. దీన్ని బట్టి ఏమని అర్థం అవుతుందంటే  అనేక మంది అమాయకమైన ప్రజలు జైలులో అండర్ ట్రయల్‌గా జైలు జీవితం గడుపుతున్నారు ’’ అని రామ్ గోపాల్ వర్మ ట్వీ‌ట్ చేశారు.

Bollywoodమరిన్ని...