Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 17 May 2022 17:22:17 IST

Nagham: టీజర్ వదిలిన సంచలన దర్శకుడు

twitter-iconwatsapp-iconfb-icon

విభు ప్రొడక్షన్స్ (Vibhu Productions) బ్యానర్‪పై నరసింహ జీడీ (Narasimmha GD)  దర్శకత్వంలో శివ దోసకాయల (Siva Doskayala) నిర్మించిన చిత్రం ‘నఘం’ (Nagham). గణేష్ రెడ్డి (Ganesh Reddy), వేమి మమత రెడ్డి (Vemi Mamatha Reddy), అయేషా టక్కి (Ayesha Takki), రాజేంద్ర కుమార్ (Rajendra Kumar) ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్ర టీజర్‪ను.. తాజాగా సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) విడుదల చేశారు. అనంతరం, హారర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధించాలని, టీజర్ చాలా బాగుందని తెలుపుతూ.. చిత్రయూనిట్‪కు వర్మ  అభినందనలు తెలిపారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు.


టీజర్‌ విషయానికి వస్తే.. ఇందులో ఒక్క డైలాగ్ లేకపోయినా.. ప్రేక్షకుల చూపు తిప్పుకోనివ్వకుండా చేసిందీ టీజర్. అరవింద్ (Aravind) కెమెరా పనితనం, భగవత్ (Bhagawatth) సంగీతం హైలెట్ అనేలా ఉన్నాయి. టీజర్ చూస్తుంటే టెక్నికల్‌గా ఈ సినిమా ఉన్నత స్థాయిలో తెరకెక్కిందని తెలుస్తుంది. విజువల్స్ కూడా సూపర్బ్ అనేలా ఉన్నాయి. హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలకు ఉండాల్సిన మూడ్‌ను బ్యాక్ గ్రౌండ్‌ స్కోర్ క్యారీ చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటమే కాకుండా.. యూట్యూబ్‪లో టాప్‪లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా, సీటు అంచున కూర్చోబెట్టేలా ఉంటుందని మేకర్స్ తెలుపుతూ.. టీజర్ విడుదల చేసిన రామ్ గోపాల్ వర్మకు ధన్యవాదాలు చెప్పారు.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
Advertisement