May 18 2021 @ 11:13AM

స్నేహితుడు చేసిన పనిని మెచ్చుకున్న రామ్ చరణ్

దేశ వ్యాప్తంగా కొవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతున్నారు. ప‌లువురు ప్ర‌జ‌ల‌కు త‌మ వంతుగా సాయాన్ని అందిస్తున్నారు. కొవిడ్ బాధితులకు ఆక్సిజ‌న్‌ కొర‌త‌ను తీర్చ‌డానికి విదేశాల నుంచి ఆక్సిజ‌న్‌ను రప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో రామ్ చ‌ర‌ణ్ స్నేహితుడుకి చెందిన  గ్రీన్ కో సంస్థ చైనా నుంచి 1000 ఆక్సిజ‌న్ కాన్సంట్రేట‌ర్ల‌ను తెప్పించి తెలంగాణ ప్ర‌భుత్వానికి అందించింది. దీనిపై స్పందించిన రామ్‌చ‌ర‌ణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా, తెలంగాణ రాష్ట్రానికే కాకుండా, ఇండియాలోని ఇత‌ర రాష్ట్రాల‌కు కూడా ఆక్సిజ‌న్ అందిస్తోన్న  గ్రీన్ కో సంస్థ‌కు అభినందించారు.