Abn logo
Mar 6 2021 @ 20:54PM

రామ్‌ చరణ్‌ చేసిన సపోర్ట్ ఇదే: శర్వానంద్‌

వెర్సటైల్ యాక్టర్ శర్వానంద్ హీరోగా 14రీల్స్ ప్లస్ పతాకంపై నూతన దర్శకుడు కిషోర్ బి. దర్శకత్వంలో.. నిర్మాతలు రామ్ ఆచంట, గోపీ ఆచంట రియలిస్టిక్ ఇన్సిడెంట్స్‌తో  నిర్మించిన చిత్రం 'శ్రీకారం'. 'నాని గ్యాంగ్‌లీడర్‌' ఫేమ్‌  ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన ప్రతీది మంచి స్పందనను రాబట్టుకుంది. రీసెంట్‌గా విడుదలైన ట్రైలర్‌ అయితే సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. మహాశివరాత్రి సందర్బంగా మార్చి 11న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. మార్చి 6 హీరో శర్వానంద్‌ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ పార్క్ హయాత్ హోటల్‌లో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్‌ మాట్లాడుతూ.. ‘‘సినిమా గురించి మాట్లాడాలి అంటే.. సాయిమాధవ్‌ బుర్రాగారు చెప్పినట్లు.. ఈ కథ విన్నప్పుడు చేయాలి. ఇది ఒక బాధ్యత అనిపించింది. ఇలాంటి కథలు మళ్లీ మళ్లీ రావు. రైతులు పండిస్తే కానీ తినలేం. పండించేవారు తక్కువై పోతున్నారు. తినేవారు ఎక్కువై పోతున్నారు. ఇంత మంచి కథ రాసుకున్నందుకు కిశోర్‌కి థ్యాంక్స్‌. కమర్షియల్‌ సినిమాలు చేయడం ఈజీ. కానీ నిర్మాతలు శ్రీకారంలాంటి సినిమాను నమ్మడం, ఇంత ఖర్చు పెట్టడం చాలా కష్టం. డేరింగ్‌గా ఉంటేనే ఇలాంటివి చేస్తారు. ఈ సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఫస్ట్‌ కాల్‌ నాకు చరణ్‌ నుంచి వచ్చింది. సినిమా పాయింట్‌ బాగుంది. ఈ సినిమా కోసం నేను ఏం చేయాలి? సపోర్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఈ సమయంలో మనం ఒకరికొకరం సపోర్ట్‌గా ఉండాలి అని నా మిత్రుడు రామ్‌చరణ్‌ చెప్పాడు. వెంటనే ఆయన చిరంజీవిగారికి చెప్పారు. చిరంజీవిగారికి మేం చూపించాము. 8న ఖమ్మంలో జరగనున్న ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నారు. వెంటనే కేటీఆర్‌గారికి ఫోన్‌ చేశాం. సపోర్ట్‌ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ నెల 9న హైదరాబాద్‌లో జరగబోయే ఈవెంట్‌కు రావడానికి ఒప్పుకున్నారు. పబ్లిసిటీ అని కాదు.. ఇలాంటి పెద్ద వారు చెబితే యూత్‌ ఇన్‌స్పైర్‌ అవుతారని మా నమ్మకం. ట్రైలర్‌ను లాంచ్‌ చేసిన నితిన్, నాని, వరుణ్‌తేజ్‌లకు థ్యాంక్స్‌. ప్రియాంకా మంచి కో స్టార్‌. ప్యూచర్‌లో బిగ్‌ స్టార్‌. యువరాజ్‌ మంచి విజువల్స్‌ ఇచ్చారు" అన్నారు.

Advertisement
Advertisement
Advertisement