Jul 22 2021 @ 19:45PM

Dil raju: చరణ్‌ – శంకర్‌ సినిమా అప్పుడే!

రాంచరణ్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమా షూటింగ్‌ను సెప్టెంబరు నెల నుంచి ప్రారంభిస్తామని నిర్మాత దిల్‌ రాజు తెలిపారు. గురువారం ఉదయం దిల్‌రాజు దంపతులు తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దిల్‌రాజు ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘‘రౌడీబాయ్‌’, ‘థ్యాంక్యూ’, ‘పాగల్‌’ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ‘ఎఫ్‌–3’ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. అల్లు అర్జున్‌ ‘ఐకాన్‌’ సినిమాను త్వరలో ప్రారంభిస్తాం. కరోనా నేపథ్యంలో స్లోగా ముందుకెళ్తున్నాం’’ అని తెలిపారు.