Chitrajyothy Logo
Advertisement
Published: Tue, 18 Jan 2022 21:40:43 IST

‘హీరో’ సినిమా చూసిన రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..

twitter-iconwatsapp-iconfb-icon
హీరో సినిమా చూసిన రామ్ చరణ్ రియాక్షన్ ఇదే..

రీసెంట్‌గా జరిగిన ‘హీరో’ మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు అతిథిగా హాజరు కావాల్సిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ వేడుకకు రాలేదు. ఈ విషయం ఆయనే ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా తెలిపారు. అయితే ఈ సినిమా ఓపెనింగ్‌కి రామ్ చరణ్ హాజరై క్లాప్ కొట్టిన విషయం తెలిసిందే. ఓపెనింగ్‌కి వచ్చిన చరణ్‌‌ని ప్రీ రిలీజ్ వేడుకకు కూడా టీమ్ ఆహ్వానించింది. అయితే ఈ వేడుకకు రాలేకపోయినప్పటికీ ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా సినిమా విడుదలకు ముందు రామ్ చరణ్ ట్వీట్ చేశారు. ఇప్పుడు సినిమా విడుదలై మంచి టాక్‌‌తో విజయవంతంగా థియేటర్లలో రన్ అవుతోంది. తాజాగా ఈ సినిమాని చూసిన రామ్ చరణ్ ట్విట్టర్ వేదికగా మరోసారి ఈ సినిమాపై స్పందించారు.

   

‘‘అశోక్ గల్లా.. సినీ ప్రపంచంలోకి నీ ఎంట్రీ అదిరింది. ‘హీరో’ సినిమా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఈ సందర్భంగా గల్లా జయదేవ్‌గారికి, పద్మావతిగారికి, డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్యకు ఇంకా టీమ్ మొత్తానికి అభినందనలు. మీ అన్ని ప్రయత్నాలలో విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను..’’ అని రామ్ చరణ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనికి ‘‘ధన్యవాదాలు రామ్ చరణ్ అన్న.. మా సినిమా మీకు నచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది..’’ అని హీరో అశోక్ ట్వీట్ చేశారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International