Abn logo
Jul 6 2020 @ 08:08AM

రామ్‌చ‌ర‌ణ్ సెకండ్ థాట్‌..!

మెగాస్టార్ చిరంజీవి నుండి న‌ట వార‌సత్వాన్ని అందుకున్న రామ్‌చ‌ర‌ణ్ అగ్ర క‌థానాయ‌కుడిగానే కాదు.. నిర్మాత‌గా కూడా సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే సినీ నిర్మాణంలో నిర్మాత‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న చిరంజీవితో మాత్ర‌మే అసోసియేట్ అయ్యారు. ఇప్పుడు మ‌రో కొత్త ఆలోచ‌న‌కు శ్రీకారం చుట్టార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. సిల్వ‌ర్ స్క్రీన్‌కు పోటీగా డిజిట‌ల్ రంగం డెవ‌ల‌ప్ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే టాలీవుడ్‌కి చెందిన ప‌లువురు స్టార్స్‌, టెక్నీషియ‌న్స్ డిజిట‌ల్ రంగంలోకి అడుగు పెట్టారు. నిర్మాత‌లు డిజిట‌ల్ కంటెంట్ డెవ‌ల‌ప్ చేయ‌డంలో ఆస‌క్తిని చూపుతున్నారు. వీరి బాట‌లోనే చ‌ర‌ణ్ కూడా డిజిట‌ల్ కంటెంట్‌పై అందించాల‌ని అనుకుంటున్నార‌ట‌. అందులో భాగంగా ఓ భారీ వెబ్ సిరీస్‌ను ఆయ‌న నిర్మించాల‌నే ఆలోచ‌న‌తో ఉన్నారనే వార్త‌లు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. మ‌రి ఈ వార్త‌ల‌పై మెగా క్యాంప్ ఎలా స్పందిస్తుందో చూద్దాం. 

Advertisement
Advertisement
Advertisement