Jul 23 2021 @ 15:41PM

Ram charan: 8 ఏళ్ల త‌ర్వాత అలా క‌నిపించ‌బోతున్న రామ్‌చ‌ర‌ణ్‌

మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ భారీ పాన్ ఇండియా మూవీ రూపొందుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జరుగుతున్నాయి. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్తొక‌టి నెట్టింట వైర‌ల్ అవుతోంది. అదేంటంటే, ఈ సినిమాలో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ట‌. అది కూడా తండ్రీ కొడుకులుగా. ఎనిమిదేళ్ల ముందు వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ న‌టించిన నాయ‌క్ సినిమాలో చ‌ర‌ణ్ ద్విపాత్రాభిన‌యం చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు మ‌రోసారి చ‌ర‌ణ్ డ్యూయెల్ రోల్ మెప్పించ‌బోతున్నాడో.. లేదో తెలియాలంటే వేచి చూడాల్సిందే. ప్ర‌స్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్న రామ్‌చ‌ర‌ణ్, సెప్టెంబ‌ర్ నుంచి శంక‌ర్ సినిమా షూటింగ్‌లో పాల్గొన‌బోతున్నాడు. దిల్‌రాజు, శిరీశ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.