పోలియో నిర్మూలనలో భాగస్వాములు కావాలి

ABN , First Publish Date - 2021-10-25T05:36:04+05:30 IST

పోలియో నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని రోటరీ సెంట్రల్‌ అధ్యక్షుడు మాచర్ల మధుసూదనరావు అన్నారు.

పోలియో నిర్మూలనలో భాగస్వాములు కావాలి
రావిమెట్లలో పోలియోపై అవగాహన ర్యాలీ

నిడదవోలు, అక్టోబరు 24:  పోలియో నిర్మూలనలో ప్రతిఒక్కరూ భాగస్వా ములు కావాలని రోటరీ సెంట్రల్‌ అధ్యక్షుడు మాచర్ల మధుసూదనరావు అన్నారు. ఆదివారం మండలంలోని రావిమెట్ల గ్రామంలో పోలియోపై అవ గాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదనరావు మాట్లాడు తూ ప్రపంచ వ్యాప్తంగా రోటరీ ఇంటర్నేషనల్‌ పోలియో నిర్మూలనకు ఎంతో కృషి చేస్తోందన్నారు. క్లబ్‌ కార్యదర్శి వెంకటేశ్వరరావు, పూర్వ అసిస్టెంట్‌ గవర్నర్‌ ఇంజే శేఖర్‌, ఓల్డేజ్‌ హోమ్‌ అధ్యక్షుడు బూరుగుపల్లి సత్యనారాయణ, ముళ్ళపూడి వెంకట్రావు, పాతూరి నాగేశ్వరరావు విద్యార్థులు పాల్గొన్నారు.

 తణుకు: పోలియో రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రోటరీ క్లబ్‌ అధ్యక్షుడు వంగూరి హనుమంతరావు అన్నారు. ఆది వారం  ప్రపంచ పోలియో నివారణ దినం సందర్భంగా గమిని ఫంక్షన్‌ హాల్‌ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ పోలియో రహిత సమాజానికి రోటరీ కృషి చేస్తోందన్నారు. అనంతరం కేక్‌ కట్‌  చేశారు. గమిని రాంబాబు, ఎం. అరుణసారథి, జి. సుధాకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-25T05:36:04+05:30 IST